Begin typing your search above and press return to search.

బాలయ్య చేసిన ఆ రెండు సూపర్ హిట్ సినిమాలను మోక్షజ్ఞ రీమేక్ చేస్తే బాగుంటుందా...

నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన సినిమాలన్నీ అతనికి స్పెషల్ ఇమేజ్ ను తీసుకొచ్చాయి.

By:  Gopi Velupala   |   24 Sept 2026 10:44 AM IST
బాలయ్య చేసిన ఆ రెండు సూపర్ హిట్ సినిమాలను మోక్షజ్ఞ రీమేక్ చేస్తే బాగుంటుందా...
X

నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన సినిమాలన్నీ అతనికి స్పెషల్ ఇమేజ్ ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా బీ,సీ సెంటర్లోని ప్రేక్షకులు బాలయ్య బాబు సినిమాలను చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కారణమేంటంటే మాస్ లో బాలయ్యకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే దానికి అసలైన కారణమని చెబుతుంటారు. ఏది ఏమైనా కూడా బాలయ్య వాళ్ళ నాన్న అయిన 'నందమూరి తారక రామారావు' గారి లెగసీని ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర వహించాడు. ప్రస్తుతం ఆయన 60 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి డ్యాన్సులు, ఫైట్లు చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటున్నాడు. 50 సంవత్సరాల తన సినీ కెరియర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకులందరిని మెప్పించాడు. అయితే తన కొడుకు అయిన 'మోక్షజ్ఞ' సైతం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

'బింబిసార' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వశిష్ట డైరెక్షన్లో మోక్షజ్ఞ మొదటి సినిమా రాబోతుంది. రీసెంట్ గా అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మోక్షజ్ఞ స్టార్ హీరోగా మారతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే బాలయ్య ఇప్పటి వరకు చేసిన క్లాసికల్ సినిమాలను మోక్షజ్ఞ తో రీమేక్ చేస్తే బాగుంటుందని కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందులో భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి సినిమాలు ఉండడం విశేషం... ఈ రెండు సినిమాలను మోక్షజ్ఞ చేస్తే అతనికి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వస్తుందని ప్రేక్షకులందరు తనను ఆదరిస్తారని చాలామంది భావిస్తున్నారు.

ఈ జనరేషన్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సినిమాలను చేస్తే బాగుంటుంది. కానీ ఈ సినిమాలను రీమేక్ చేయాలనే ఇంట్రెస్ట్ మోక్షజ్ఞ కి ఉందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే మొదటి రెండు సినిమాలను మాత్రం స్ట్రైయిట్ కథలతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సినిమాల తర్వాత అతని యాక్టింగ్ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉంటుందో దాన్నిబట్టి సినిమాలను రీమేక్ చేయాలా లేదా అనే విషయంలో బాలయ్య బాబు నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా మోక్షజ్ఞ ఇప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది...అలాగే నందమూరి ఫ్యామిలీ లెగసీ ని బాలయ్య వారసత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మోక్షజ్ఞ మీద ఉంది...