రొమాంటిక్ లవ్‌స్టోరి జానర్ వదిలిపెట్టడట
నవతరం నటీనటులు అనీత్ పద్దా- అహాన్ పాండే తెరపై అద్భుతమైన రొమాన్స్ ని పండించారు. సహజ సిద్ధమైన నటనతో అలరించారు.
By: Sivaji Kontham | 25 Sept 2025 2:00 PM ISTజానర్లు ఎన్ని ఉన్నా రొమాంటిక్ కామెడీలు, రొమాంటిక్ లవ్ స్టోరీలకు ఉండే ఆదరణ వేరు. ముఖ్యంగా స్వచ్ఛమైన ప్రేమకథలను ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో పనితనం చూపిస్తే, అలాంటి సినిమాల సక్సెస్ పెద్ద కిక్కిస్తుందని ఇటీవలే విడుదలైన `సయ్యారా` చిత్రం నిరూపించింది. నవతరం నటీనటులు అనీత్ పద్దా- అహాన్ పాండే తెరపై అద్భుతమైన రొమాన్స్ ని పండించారు. సహజ సిద్ధమైన నటనతో అలరించారు.
స్వచ్ఛమైన ప్రేమకథలకు ఎప్పుడూ ఆదరణ ఒకేలా ఉంది. ఈ జానర్ కి మాస్ క్లాస్ అనే తేడా లేదు. నిజమైన ప్రేమలో జీవించే జంట కుదిరితే అది వర్ణరంజితంగా మారుతుంది. `సయ్యారా` విజయం యష్ రాజ్ ఫిలింస్ కి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకే ఇప్పుడు మోహిత్ సూరి వరుసగా ఇదే జానర్ లో సినిమాలను తెరకెక్కించేందుకు ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. `సయ్యారా` గ్రాండ్ సక్సెస్ తర్వాత మోహిత్ సూరి తన తదుపరి సినిమాని యష్ రాజ్ ఫిలింస్ లోనే తెరకెక్కించేందుకు సంతకం చేసారని తెలిసింది.
ఈసారి కూడా `సయ్యారా` జానర్‌లోనే సినిమా ఉంటుంది. నవతరం నటీనటులను ఎంపిక చేస్తారు. సంగీతం కూడా ప్రధాన భూమికను పోషిస్తుంది. ఇంకా టైటిల్ నిర్ణయించని మ్యూజికల్ లవ్ స్టోరి ఇది...! అని చెబుతున్నారు. స్క్రీన్ ప్లే ప్రస్తుతం డెవలప్ చేస్తున్నారు. 2026 ప్రారంభంలో నటీనటులను ఎంపిక చేస్తారు. సంవత్సరం మధ్యలో షూటింగ్ ప్లాన్ చేస్తారని తెలుస్తోంది.
