Begin typing your search above and press return to search.

మోహన్ లాల్ 'వృషభ' తెలుగు ట్రైలర్.. అల్లు బాస్ కు మరో హిట్టా?

ఇప్పుడు వృషభ మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు అల్లు బాస్. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ఆ మూవీకి నంద కిషోర్ దర్శకత్వం వహించారు.

By:  M Prashanth   |   20 Dec 2025 11:58 AM IST
మోహన్ లాల్ వృషభ తెలుగు ట్రైలర్.. అల్లు బాస్ కు మరో హిట్టా?
X

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. ఇప్పటి వరకు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎన్నో డబ్బింగ్ మూవీస్ ను రిలీజ్ చేసి మంచి విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. కాంతార, చావా, మహావతార్ నరసింహ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. ఆయా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ సొంతం చేసుకున్నారు.

ఇప్పుడు వృషభ మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు అల్లు బాస్. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ఆ మూవీకి నంద కిషోర్ దర్శకత్వం వహించారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమా విడుదల కానుండగా.. ఇప్పుడు తెలుగు ట్రైలర్ రిలీజైంది. తన కలల్లో హింస, రక్తపాతం, యుద్ధం వంటి విషయాలు అతడిని ఆకట్టుకునేలా అవుతున్నాయి.. అంటూ వస్తున్న డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. పవర్ ఫుల్ స్టోరీతో సినిమా ఉంటుందని.. లేటెస్ట్ గ్లింప్స్ చెప్పకనే చెబుతోంది.

ట్రైలర్ లో మోహన్ లాల్ రోల్.. రక్తపాతం, యుద్ధంతో నిండిన వివిధ హింసాత్మక కలలతో వెంటాడడంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మోహన్ లాల్ గత జన్మలో విజయేంద్ర వృషభ అనే శక్తివంతమైన రాజుగా చూపించారు మేకర్స్. ఒక పురాతన శత్రువు మళ్లీ ఆయన వంశానికి ప్రమాదంగా దగ్గరగా వస్తున్నట్లు చూపించారు.

ఆ తర్వాత శత్రువులు ప్రతీకారం తీర్చుకోవటానికి పథకం వేస్తుండగా, మోహన్ లాల్ కొడుకు తన తండ్రిని రక్షించడానికి తీవ్రంగా కృషి చేస్తాడు. ప్రతిదీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తాడు. అయితే సినిమా కథ రెండు కాలాలకు సంబంధించినదిగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ట్రైలర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ట్రైలర్ యాక్షన్ సీన్స్, అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ డెప్త్ తో ఉండగా.. కచ్చితమైన పీరియాడికల్ ఎక్స్పీరియన్స్ ను మూవీ అందిస్తుందనే క్లారిటీ వచ్చింది. మోహన్ లాల్ తో పాటు సమర్జిత్ లంకేష్ సెటిల్డ్ గా నటించారు. సామ్ సీఎస్ సంగీతం, ఆస్కార్ విజేత రెసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్.. వృషభ ట్రైలర్ కు పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.

ఇక సినిమాలో రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, గరుడ రామ్, కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. పీటర్ హెయిన్, స్టంట్ సిల్వా, నిఖిల్ అడ్రినలిన్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. అయితే వృషభ మూవీ డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మరి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.