మోహన్ లాల్ రేర్ ఫీట్!
కానీ కొన్ని కారణాల వల్ల వృషభ మూవీ దీపావళికి రావడం లేదు. దీపావళి నుంచి వాయిదా పడిన వృషభ నవంబర్ 6వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్నట్టు మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 10 Oct 2025 12:00 AM ISTమలయాళ నటుడు మోహన్ లాల్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. పాత్ర నచ్చితే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎలాంటి సినిమానైనా చేస్తారాయన. అలా చేసిన సినిమానే కన్నప్ప. అయితే మోహన్ లాల్ ఇప్పుడు మంచి జోష్ తో ఉన్నారు. ఒకప్పుడు ఏడాది ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా భావించే ఆయన ఇప్పుడు ఒకే ఏడాదిలో పలు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే మోహన్ లాల్ ఈ ఏడాది ఎల్2: ఎంపురాన్, తుదరుమ్, హృదయపూర్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాలతో మంచి హిట్లు అందుకోగా, ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ వృషభ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి వృషభ ఈ దీపావళికే రిలీజవాల్సింది.
కానీ కొన్ని కారణాల వల్ల వృషభ మూవీ దీపావళికి రావడం లేదు. దీపావళి నుంచి వాయిదా పడిన వృషభ నవంబర్ 6వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్నట్టు మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. డైరెక్టర్ నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా రిలీజైతే ఒకే ఏడాది నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన సీనియర్ హీరోగా మోహన్ లాల్ నిలుస్తారు. రీసెంట్ టైమ్స్ లో ఒకే సంవత్సరం ఇన్ని సినిమాలు రిలీజ్ చేసిన హీరో మోహన్ లాల్ అనే చెప్పాలి.
ఏదేమైనా ఒకే ఏడాది తమ అభిమాన హీరో నుంచి ఇన్ని సినిమాలు రావడం చూసి అతని ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వృషభ మూవీకి ఖైదీ, మహావతార్ నరసింహ సినిమాలకు సంగీతం అందించిన సామ్ సి ఎస్ మ్యూజిక్ అందిస్తుండగా, కనెక్ట్ మీడియా, ఏవిఎస్ ఫిల్మ్స్ వృషభను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
