Begin typing your search above and press return to search.

అరుదైన గౌరవం దక్కించుకున్న తుడరుమ్.. హీరో రియాక్షన్!

మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా మూవీ తుడరుమ్. అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అధికారికంగా ఎంపికైంది. ప్రస్తుతం దీనిపై స్పందించిన మోహన్ లాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు..

By:  Madhu Reddy   |   7 Nov 2025 4:00 PM IST
అరుదైన గౌరవం దక్కించుకున్న తుడరుమ్.. హీరో రియాక్షన్!
X

మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా మూవీ తుడరుమ్. అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అధికారికంగా ఎంపికైంది. ప్రస్తుతం దీనిపై స్పందించిన మోహన్ లాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు.. మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన తుడరుమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకోవడమే కాకుండా మలయాళ ఇండస్ట్రీకి మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే అలాంటి తుడరుమ్ మూవీ 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో అధికారికంగా ఎంపిక కావడం గురించి మీతో పంచుకోవడం చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన గుర్తింపుకు చాలా ధన్యవాదాలు అంటూ మోహన్ లాల్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.

నవంబర్లో జరగనున్న 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో తుడరుమ్ ఇండియన్ పనోరమ విభాగం కింద ఎంపికైంది.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రధాన భాగంగా ఇండియన్ పనోరమా ఎంపికలు చలనచిత్ర కళను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో సమకాలిన భారతీయ సినిమాలలో ఉత్తమమైనవి. దేశ గొప్ప సంస్కృతి వారసత్వంతో పాటు భారతీయ చిత్రాలను ప్రోత్సహించడానికి 1978లో ప్రవేశ పెట్టబడిన ఇండియన్ పనోరమా ఈ సంవత్సరం ఉత్తమ భారతీయ చిత్రాలను ప్రదర్శించడానికి పూర్తిగా అంకితభావం కలిగి ఉంది. అలాగే ఇండియన్ పనోరమా యొక్క ప్రాథమిక లక్ష్యం వివిధ వర్గాల కింద ఈ చిత్రాలను లాభాపేక్షలేని ప్రదర్శన ద్వారా చలనచిత్ర కళను ప్రోత్సహించడానికి సినిమాటిక్ నేపథ్య, సౌందర్య నైపుణ్యం కలిగిన ఫీచర్ అలాగే నాన్ ఫీచర్ సినిమాలను ఎంపిక చేసుకోవడం.

అలా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరగబోతోంది. మోహన్ లాల్ నటించిన తుడరుమ్ మూవీ విషయానికి వస్తే..ఈ సంవత్సరం అత్యంత పేరుగాంచిన మలయాళ సినిమాలలో ఈ మూవీ కూడా ఒకటి. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ లాల్ హీరోగా శోభన మోహన్ లాల్ సరసన హీరోయిన్ గా నటించింది. మోహన్ లాల్ ఇందులో ఓ టాక్సీ డ్రైవర్ గా పని చేశాడు. అలా ఒక సాధారణ ట్యాక్సీ డ్రైవర్ గా జీవితం గడుపుతున్న మోహన్ లాల్ జీవితం అనుకొని మలుపులు తిరుగుతుంది. ఒక హత్యా కేసులో మోహన్ లాల్ ఇరుక్కుంటారు. అయితే ఈ హత్య కేసు నుండి ఎలా బయటపడ్డారు అనేది తుడరుమ్ మూవీలో చూడవచ్చు.

అలా ఈ సినిమాలో మోహన్ లాల్ తో పాటు శోభన,ప్రకాష్ వర్మ, ఫర్హాన్ ఫాజిల్, బీను పప్పు, మనియన్ పిల్ల రాజు, థామస్ మాథ్యూలు నటించారు.. ఈ సినిమా కేరళ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ సాధించిన మొట్టమొదటి మలయాళ మూవీ అని చెప్పుకోవచ్చు. అలా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 210 కోట్లు కొల్లగొట్టి ఇండస్ట్రీలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయింది.

ప్రస్తుతం మోహన్ లాల్ వృషభ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఇటీవలే మోహన్ లాల్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే. అలా తన నటనతో 65 ఏళ్ల వయసులో కూడా మంచి మంచి కథలు ఎంచుకుంటూ సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.