నవంబర్ ఫస్ట్ వీక్.. విన్నర్ ఎవరో?
అయితే వృషభ వచ్చిన తర్వాత రోజు.. టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు జటాధరతో రానున్నారు.
By: M Prashanth | 10 Oct 2025 9:59 AM ISTఎప్పటిలానే నవంబర్ లో వివిధ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందుకు గాను ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి. ఆయా చిత్రాల మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. అలా నవంబర్ ఫస్ట్ వీక్ లో మూడు సినిమాలు విడుదల అవ్వనున్నాయి. వృషభ, జటాధర, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలు పోటీ పడుతున్నాయి.
అయితే మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ మూవీ వృషభ’తో నవంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిస్టారికల్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాను నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాలీవుడ్ సినీ చరిత్రలో అత్యధిక బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా గ్రాండ్ గా మూవీని తెరకెక్కిస్తున్నారు.
ఆ సినిమాలో నటుడు శ్రీకాంత్ కొడుకు, యంగ్ హీరో రోషన్ మేక ఒక ప్రధాన పాత్ర పోషించగా.. ఇటీవల మేకర్స్ రిలీజ్ డేట్ ను నవంబర్ 6వ తేదీగా అనౌన్స్ చేశారు. యాక్షన్, డ్రామా, అద్భుతమైన విజువల్స్ కలయికగా ఉన్న కథతో ఎపిక్ యాక్షన్ సినిమాటిక్ జర్నీ రానున్న సినిమా.. తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని తెలియజేయనుంది.
అయితే వృషభ వచ్చిన తర్వాత రోజు.. టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు జటాధరతో రానున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమా కూడా బడ్జెట్ తో రూపొందుతోంది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తున్న ఆ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7వ తేదీన సినిమా రిలీజ్ కానున్నట్లు ఎప్పుడో ప్రకటించారు.
అదే రోజు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో థియేటర్స్ లోకి రానున్నారు. చిలసౌ, మన్మథుడు 2 ఫేమ్, నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమాలో రష్మిక గర్ల్ ఫ్రెండ్ గా కనిపించనుండగా.. దీక్షిత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమా కూడా నవంబర్ 7వ తేదీన రిలీజ్ కానుంది.
మొత్తానికి మూడు సినిమాలు.. మూడు జోనర్స్ లో రూపొందుతున్నాయి. అదే సమయంలో ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్నాయి. కానీ అది సరిపోదు. మేకర్స్ కచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది. దానికి పాజిటివ్ మౌత్ టాక్ తోడైతే తిరుగుండదు.. మరి నవంబర్ ఫస్ట్ వీక్ లో ఏ మూవీ విన్నర్ గా నిలుస్తుందో వేచి చూడాలి.
