ఇప్పుడు వాళ్లెవరూ బతికిలేరు.. అందుకే!
చంద్రలేఖ సినిమాలో హాస్పిటల్ లో వచ్చే ఓ ముఖ్యమైన సీన్ చూసి మోహన్ లాల్ చాలా బాధ పడ్డారట.
By: Sravani Lakshmi Srungarapu | 25 Aug 2025 11:16 AM ISTరీరిలీజుల ట్రెండ్ పెరిగాక పాత సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. హీరోలు కూడా ఫ్యాన్స్ ఆ సినిమాను మళ్లీ థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేయడం చూస్తుండటాన్ని ఆనందిస్తూ తాము కూడా మరోసారి ఆయా సినిమాలను చూస్తూ అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ సంతోషిస్తుంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం తన పాత సినిమాలను చూడటం మానేసినట్టు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
చంద్రలేఖ రీమేక్‌తో సూపర్‌హిట్
ఏ హీరో అయినా తమ హిట్ సినిమాలను చూసి హ్యాపీగా ఫీలవుతారు కానీ మీరు ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారని ఆయన్ని అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేసింది. మోహన్ లాల్ గతంలో చంద్రలేఖ అనే సినిమా చేశారు. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన చంద్రలేఖకు రీమేక్ గా తెరకెక్కిన ఆ సినిమా మలయాళంలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అందుకే పాత సినిమాలు చూడటం మానేశా
చంద్రలేఖ సినిమాలో హాస్పిటల్ లో వచ్చే ఓ ముఖ్యమైన సీన్ చూసి మోహన్ లాల్ చాలా బాధ పడ్డారట. ఆ సీన్ లో తనతో పాటూ నటించిన వారిలో ఎవరూ ఇప్పుడు బతికి లేరని, అందరూ చనిపోయారని తెలిశాక తనకు చాలా బాధేసిందని, వారితో తనకు చాలా మంచి మెమొరీస్ ఉన్నాయని, అలాంటి నటులు ఇప్పుడు లేరని తలచుకుంటే బాధేస్తుందని మోహన్ లాల్ అన్నారు.
హృదయపూర్వంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు
ఈ కారణంతోనే అప్పట్నుంచి తాను తన గత సినిమాలను చూడటం మానేశానని లాలెట్టన్ చెప్పారు. మోహన్ లాల్ చేసిన ఈ కామెంట్స్ ఫ్యాన్స్ ను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. ఇక మోహన్ లాల్ సినిమాల విషయానికొస్తే ఈ ఇయర్ ఆల్రెడీ ఎల్2: ఎంపురాన్, తుదరమ్ సినిమాలతో సూపర్‌హిట్లు అందుకున్న మోహన్ లాల్ నుంచి హృదయపూర్వం అనే సినిమా ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్యం అంతికాడ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహనన్ కీలక పాత్రలో నటించారు. హృదయపూర్వం సినిమాపై కూడా ఆడియన్స్ కు మంచి అంచనాలే ఉన్నాయి.
