Begin typing your search above and press return to search.

మోహన్‌లాల్‌ కి మన హీరోలకి ఎందుకు ఇంత తేడా?

మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్‌ కొత్త సినిమా 'దృశ్యం 3' ప్రారంభం అయింది. ఇప్పటి వరకు వచ్చిన దృశ్యం రెండు పార్ట్‌లు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Ramesh Palla   |   22 Sept 2025 9:00 PM IST
మోహన్‌లాల్‌ కి మన హీరోలకి ఎందుకు ఇంత తేడా?
X

మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్‌ కొత్త సినిమా 'దృశ్యం 3' ప్రారంభం అయింది. ఇప్పటి వరకు వచ్చిన దృశ్యం రెండు పార్ట్‌లు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దృశ్యం ప్రాంచైజీలో రాబోతున్న చివరి సినిమా ఇదే కావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దృశ్యం 2 వచ్చి చాలా కాలం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3వ పార్ట్‌ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు దృశ్యం 3 సినిమా ప్రారంభం అయినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. మోహన్‌ లాల్ ఉన్న బిజీగా దృశ్యం 3 ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు అని అంతా భావించారు. కానీ దర్శకుడు డేట్లు అడిగిన వెంటనే ఇవ్వడం మాత్రమే కాకుండా, ఇప్పటికే షూటింగ్‌ సైతం ప్రారంభించారని తెలుస్తోంది. దాదాపుగా మూడున్నర నెలల పాటు దృశ్యం 3 సినిమా షూటింగ్‌ చేస్తారని మలయాళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మలయాళ సినీ మీడియాలో ఈ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

దృశ్యం 3 సినిమా షూటింగ్‌ ప్రారంభం

దృశ్యం 3 సినిమాను మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. సమ్మర్‌ ఆరంభం వరకు దృశ్యం 3 వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అదే జరిగితే తక్కువ సమయంలోనే అత్యధిక సినిమాలు విడుదల చేసిన హీరోగా మోహన్‌ లాల్‌ ఘనత దక్కించుకున్నాడు. గడచిన ఏడాది కాలంగా మోహన్‌ లాల్‌ నుంచి బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది చివర్లో బరోజ్ సినిమా వచ్చింది. ఆ సినిమా పిల్లల సినిమాగా ప్రచారం జరగడంతో పెద్దలు వెళ్లలేదు. ఆ తర్వాత హీరోగా మోహన్‌ లాల్‌ పలు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. అదే సమయంలో కన్నప్ప వంటి సినిమాల్లో గెస్ట్‌ రోల్స్‌ ను పోషించడం ద్వారా ఆ సినిమాల స్థాయిని సైతం పెంచడంలో మోహన్‌ లాల్‌ కీలక పాత్ర పోషించాడు అనేది ఆయన అభిమానుల మాట.

హృదయపూర్వం సినిమాతో మోహన్‌ లాల్‌

బరోజ్‌ తర్వాత మోహన్‌ లాల్‌ నుంచి వరుసగా ఎంపురాన్‌, తుడారుమ్‌ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలకు మంచి స్పందన వచ్చింది. హృదయపూర్వం అనే సినిమాతోనూ మోహన్‌ లాల్‌ మెప్పించే ప్రయత్నం చేసి సక్సెస్‌ అయ్యాడు. మొత్తానికి మోహన్‌ లాల్‌ నుంచి బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు రావడం అభిమానులకు ఆనందంను కలిగిస్తున్నాయి. మోహన్‌ లాల్‌ వయసు 65 ఏళ్లు. ఈ వయసులో సాధారణంగా యంగ్‌ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించడం, అది కూడా ఏడాదికి రెండు మూడు సినిమాలు మాత్రమే కానీ మోహన్‌ లాల్‌ మాత్రం హీరోగా ఏడాదిలో నాలుగు అయిదు సినిమాలు చేస్తున్నాడు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత ఇంత ఉత్సాహంగా చేస్తున్నారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన చేస్తున్న ప్రతి సినిమాను అభిమానులు ఏదో రకంగా ఆస్వాదిస్తూనే ఉన్నారు.

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోల సినిమాలు..

మోహన్‌ లాల్‌ 65 ఏళ్ల వయసులో ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు చేస్తూ ఉంటే మన హీరోలు మాత్రం ఏడాదికి ఇప్పటికీ ఒకటే అంటున్నారు. కొందరు హీరోలు ఒక ఏడాదిలో కనీసం ఒక్క సినిమాను విడుదల చేయలేక పోతున్నారు. పెద్ద సినిమాలు, ఇండస్ట్రీ మనుగడను రక్షించే సినిమాలు రావాలని ఇండస్ట్రీ అంతా కోరుకుంటారు. కానీ ఎక్కువ సినిమాలు అనేది అసాధ్యంగా మారింది. మోహన్‌ లాల్‌ మాదిరిగా మన తెలుగు హీరోలు ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడం లేదు అంటూ చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. మన హీరోలు అంత రిస్క్‌ను చేయలేరు, అంత ఫిజికల్‌ ఫిట్‌నెస్ ఉండరు కనుక వరుస షూటింగ్స్ చేయలేరు అనేది కొందరి మాట. ఆ వాదనలో నిజా నిజాలు పక్కన పెడితే మన హీరోలు ఏడాదిలో కనీసం రెండు సినిమాలు అయినా చేయాల్సిందే అని అభిమానులు కోరుతున్నారు. అది ఎప్పటికి సాధ్యం అయ్యేనో చూడాలి.