Begin typing your search above and press return to search.

దోశ కింగ్ గా సూపర్ స్టార్?

సూపర్ స్టార్.. అదేనండీ మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుస హిట్స్ తో ఓ రేంజ్ లో అలరిస్తున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ సందడి చేస్తున్నారు.

By:  M Prashanth   |   7 Sept 2025 8:00 PM IST
దోశ కింగ్ గా సూపర్ స్టార్?
X

సూపర్ స్టార్.. అదేనండీ మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుస హిట్స్ తో ఓ రేంజ్ లో అలరిస్తున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ సందడి చేస్తున్నారు. ఈ ఏడాదిలో అప్పుడే మూడు భారీ విజయాలు సొంతం చేసుకుని తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. మలయాళంలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు.

కేవలం ఆరు నెలల్లో రూ.540 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి.. అదుర్స్ అనిపించుకున్నారు. L2 ఎంపురాన్, తుడరుం, హృదయపూర్వం చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న మోహన్ లాల్.. ఇప్పుడు వృషభ మూవీతో బిజీగా ఉన్నారు. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

ఆయన లీడ్ రోల్ లో నటించనున్న దృశ్యం-3 షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. అదే సమయంలో ఇప్పుడు మరో వార్త సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. దోశ కింగ్ గా మోహన్ లాల్ కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ వద్ద చాలా కాలంగా దోశ కింగ్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ రెడీగా ఉంది.

ఆ స్క్రిప్ట్ ను రీసెంట్ గా మోహన్ లాల్ కు జ్ఞానవేల్ నెరేట్ చేశారని తెలుస్తోంది. సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. త్వరలో కార్యరూపం దాల్చవచ్చని టాక్ వినిపిస్తోంది. సూపర్ స్టార్ ను కొత్త జోనర్ లో చూడనున్నామని ప్రచారం జరుగుతోంది. శరవణ భవన్ యజమాని రాజగోపాల్ నిజ జీవిత కథ ఆధారంగా సినిమా ఉండనుందని వినికిడి.

రాజగోపాల్ కు హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడగా.. ఇప్పుడు ఆయన కథపై మూవీ అంటూ టాక్ వస్తుండగా.. అందరిలో ఆసక్తి నెలకొంది. కథాంశం ఆసక్తికరంగా ఉందని, నిర్మాణంలోకి వెళితే హిట్ అయ్యే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. డార్క్ షేడ్స్ ఉన్న రోల్ లో మోహన్ లాల్ ను చూడనున్నామని అంటున్నారు.

అయితే జ్ఞానవేల్ రీసెంట్ గా వేట్టాయన్ తో అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇప్పుడు దోశ కింగ్ తో మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఇంకా ఎలాంటి అప్డేట్ లేనప్పటికీ.. దోశ కింగ్ తమిళం, మలయాళంలో ద్విభాషా ప్రాజెక్ట్‌ గా రూపొందుతుందా లేదా మాలీవుడ్ లో మాత్రమే తెరకెక్కుతుందా అనేది తెలియాల్సి ఉంది. మరి మేకర్స్ ఏం చేస్తారో.. సినిమా ఎప్పుడు రెడీ అవుతుందో వేచి చూడాలి.