హంతకుడి పాత్రలో మోహన్‌లాల్?
రైతు కుటుంబంలో పుట్టిన రాజగోపాల్ చదువు లేకపోయినా దేశంలోని ఎన్నో ప్రాంతాలతో పాటూ విదేశాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించే వరకు ఎదిగారు.
By: Sravani Lakshmi Srungarapu | 10 Sept 2025 10:32 AM ISTకంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. లూసిఫర్2, తుదరమ్, హృదయపూర్వం సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మోహన్ లాల్ టాలెంటెడ్ డైరెక్టర్ టి.జే జ్ఞానవేల్ తో కలిసి ఓ ప్రాజెక్టు కోసం పని చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
శరవణ భవన్ హోటల్ యజమాని జీవిత కథతో..
జై భీమ్, వేట్టయాన్ సినిమాలతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న జ్ఞానవేల్ ఇప్పుడు మోహన్ లాల్ తో ఓ సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. తమిళనాడులోని శరవణ భవన్ హోటల్ ఓనర్ రాజగోపాల్ జీవిత కథ ఆధారంగా ఆ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ రాజగోపాల్ లైఫ్ స్టోరీని రెడీ చేసుకున్న జ్ఞానవేల్ ప్రస్తుతం మోహన్ లాల్ తో డిస్కషన్స్ చేస్తున్నారని సమాచారం.
చదువు లేకున్నా సక్సెస్
రైతు కుటుంబంలో పుట్టిన రాజగోపాల్ చదువు లేకపోయినా దేశంలోని ఎన్నో ప్రాంతాలతో పాటూ విదేశాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించే వరకు ఎదిగారు. ఆయనది మంచి సక్సెస్‌ఫుల్ స్టోరీ. కానీ జాతకాల పిచ్చి ఆయన్ని హంతకుణ్ణి చేసింది. ఎన్నో ఏళ్ల పాటూ కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ ఆ పిచ్చితో పోయాయి. ఆఖరి రోజుల్లో ఆయన జైలులో కూడా ఉండాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే రాజగోపాల్ లైఫ్ లో ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి. అలాంటి కథను ఆడియన్స్ కు అందించాలని జ్ఞానవేల్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తుండగా ఇప్పటికి అది కుదిరిందంటున్నారు.
పరిశీలనలో దోశ కింగ్ టైటిల్
ఈ సినిమాకు దోశ కింగ్ అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. జంగ్లీ పిక్చర్స్ అనే సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని అంటున్నారు. సక్సెస్‌ఫుల్ వ్యాపారి కథగా మొదలైన అతని జర్నీ ఎంతో విషాదంగా ముగిసింది. మోహన్ లాల్ రాజగోపాల్ పాత్రలో నటిస్తారని తెలిసినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ కథలో ఆయన ఎలా నటిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
