Begin typing your search above and press return to search.

స్టార్ కిడ్ ఎంట్రీకి సర్వం సిద్ధం.. తండ్రి రియాక్షన్ ఇదే!

అయితే ఈ పూజ కార్యక్రమాల్లో మోహన్ లాల్ కూడా పాల్గొన్నారు.. ఇక తుడక్కం పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న మోహన్ లాల్ తన ఇద్దరు పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Madhu Reddy   |   30 Oct 2025 6:06 PM IST
స్టార్ కిడ్ ఎంట్రీకి సర్వం సిద్ధం.. తండ్రి రియాక్షన్ ఇదే!
X

ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అంటే కేవలం మలయాళ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాలేదు. మోహన్ లాల్ పేరు దేశవ్యాప్తంగా ఉండే సినీ అభిమానులకు సుపరిచితమే.. అయితే అలాంటి మోహన్ లాల్ ఇంటి నుండి ఓ హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.ఆమె ఎవరో కాదు మోహన్ లాల్ కూతురే.. విస్మయ మోహన్ లాల్ తాజాగా తుడక్కం అనే సినిమాతో మలయాళం లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జూడ్ ఆంథానీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. విస్మయ మోహన్ లాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తుడక్కం మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజు కొచ్చి లో ఘనంగా జరిగాయి.

అయితే ఈ పూజ కార్యక్రమాల్లో మోహన్ లాల్ కూడా పాల్గొన్నారు.. ఇక తుడక్కం పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న మోహన్ లాల్ తన ఇద్దరు పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆ కార్యక్రమంలో మోహన్ లాల్ మాట్లాడుతూ.. "నా ఇద్దరు పిల్లలు నా తర్వాత సినీ ఇండస్ట్రీలోకి వస్తారని నేను అస్సలు ఊహించలేదు.. నేను ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తానని ఎప్పుడూ కూడా ఊహించలేదు.అనుకోకుండానే నేను హీరో అయిపోయాను. అలా నా పిల్లలు సినిమాల్లోకి రావాలని నేను అనుకోలేదు. వస్తారని కూడా ఊహించలేదు.. ఇక నన్ను ప్రేక్షకులే నటుడిగా మార్చారు.. కొన్ని సంవత్సరాల క్రితం నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ఏమీ లేవు.. ఇక నా పిల్లల ప్రతిభ చిన్నప్పుడే గుర్తుపట్టాను. ప్రణవ్,విస్మయ ఇద్దరు కూడా చిన్నతనం నుండే ఎంతో మంచి ప్రతిభవంతులుగా ఉన్నారు. అప్పు స్కూల్లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. మాయ కూడా అనేక నాటకాల్లో నటించి ఎన్నో అవార్డులు గెలుచుకుంది" అంటూ తన కొడుకు కూతురు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోహన్ లాల్..

అలాగే నటన అనేది ఒక వరం అని.. కానీ ఈ నటనలో పట్టుదల, కృషి, సరైన అవకాశాలు ఎంచుకోవడం చాలా అవసరమం.. ఒక నటుడు ఎంత ప్రతిభావంతుడు అయినప్పటికీ వాళ్లకి సరైన సినిమా వస్తేనే పేరు తెచ్చుకుంటారు. నటుడిగా రాణించాలంటే మంచి సినిమాలతో పాటు గొప్ప సహనటులు కూడా చాలా అవసరం.. ఇక నా పిల్లల సినీ ఎంట్రీ ఊహించని విధంగా జరిగింది.ఒక తండ్రిగా.. నటుడిగా..నా ఇద్దరు పిల్లలు ఇండస్ట్రీలో కొనసాగడానికి సహాయపడే ఒక ఇంధనంగా మాత్రమే ఉండగలను.. మిగిలినదంతా వాళ్ళ యాక్టింగ్ తో వాళ్లే పేరు తెచ్చుకోవాలి అంటూ మోహన్ లాల్ చెప్పుకొచ్చారు.అలాగే తన పిల్లల సినీ ఎంట్రీ గురించి కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు..

ఇక మోహన్ లాల్ కూతురు విస్మయ మోహన్ లాల్ తుడక్కం మూవీ ద్వారా సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ కూడా డైస్ ఇరా అనే మూవీ తో మన ముందుకు రాబోతున్నారు.. ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా.. రాహుల్ సదాశివన్ డైరెక్షన్లో సైకలాజికల్ మిస్టరీ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 31న అనగా మరికొద్ది గంటల్లో మలయాళం లో విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా మోహన్ లాల్ కెరియర్ కి ఏ విధంగా ప్లస్ అవుతుందో చూడాలి.