Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తో ది ఛైన్ స్మోకర్స్ సందడి!

మోహన్‌లాల్ వంటి గొప్ప నటుడిని కలవడం తమకు సంతోషంగా ఉందని ఆయనను ఒక కొత్త స్నేహితుడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

By:  Srikanth Kontham   |   25 April 2026 11:00 PM IST
మెగాస్టార్ తో ది ఛైన్ స్మోకర్స్ సందడి!
X

గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్స్ - ఇండియన్ సినిమా లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. తాజాగా అలాంటి ఓ అద్భుతమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికన్ పాప్ - డిజె ద్వయం `ది ఛైన్‌స్మోకర్స్` మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి దిగిన ఫోటో ఒక‌టి ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరంతా కలిసిన ఈ ఫోటో చూసి అభిమానులు ఇది కదా క్రేజీ క్రాస్ ఓవర్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డల్లాస్‌లో మ్యూజిక్ షో ప్రారంభానికి ముందు ది ఛైన్‌స్మోకర్స్ సభ్యులు డ్రూ ట్యాగ్గర్ట్ - అలెక్స్ పాల్ ఈ విషయాన్ని పంచుకున్నారు.

మోహన్‌లాల్ వంటి గొప్ప నటుడిని కలవడం తమకు సంతోషంగా ఉందని ఆయనను ఒక కొత్త స్నేహితుడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంగీత రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఈ ఇద్దరు కళాకారులకు మోహన్‌లాల్ తనదైన శైలిలో స్వాగతం పలికారు. ఈ అరుదైన సమావేశం భారతీయ సినిమా , పాశ్చాత్య సంగీత ప్రపంచాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించినట్లయింది. ఈ ఫోటోలో మోహన్‌లాల్ విలక్షణమైన చిరునవ్వుతో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. సాధారణంగా హాలీవుడ్ స్టార్స్ లేదా పాప్ సింగర్స్ ఇండియా వచ్చినప్పుడు స్థానిక నటులను కలవడం చూస్తుంటాం. కానీ అమెరికా వేదికగా భారతీయ నటుడు ఇలాంటి గ్లోబల్ స్టార్స్‌తో కలిసి కనిపించడం విశేషం.

మోహన్‌లాల్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపుకు , ఆయనకున్న స్నేహసంబంధాలకు ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలోకి వచ్చిన నిమిషాల్లోనే వేల సంఖ్యలో లైకులు కామెంట్లు చేరాయి. `క్లోజర్` వంటి గ్లోబల్ హిట్ సాంగ్స్ ఇచ్చిన ఛైన్‌స్మోకర్స్ - కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ మధ్య ఏదైనా మ్యూజికల్ కొలాబరేషన్ ఉండబోతోందా? అని అభిమానులు ఆస‌క్తిగా అడుగుతున్నారు. వీరిద్దరూ ఏదైనా సినిమా ప్రాజెక్ట్ గురించి చర్చించారా లేదా కేవలం స్నేహపూర్వకంగా కలిశారా? అనే చర్చా అప్పుడే మొద‌లైపోయింది.

ప్రతిభకు , కళకు భౌగోళిక సరిహద్దులు ఉండవని ఈ కలయిక మరోసారి నిరూపించింది. మోహన్‌లాల్ లాంటి దిగ్గజ నటులు గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇలాంటి స్టార్స్‌తో అనుసంధానం కావడం భారతీయ సినిమా కీర్తిని మరింత పెంచుతుంది. త్వరలోనే వీరి కలయికలో ఏదైనా ఆసక్తికరమైన అప్‌డేట్ వస్తుందేమోనని సినీ , సంగీత ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజిక్ , సినిమా కలగలిసిన ఈ క్షణాలు అభిమానులకు నిజంగా ఒక స్వీట్ సర్ప్రైజ్.