మోహన్ లాల్ పాన్ఇండియా వృషభ టీజర్.. ఎలా ఉందంటే..
మోహన్ లాల్ పొడవైన జుట్టుతో చేతిలో ఖడ్గం పట్టుకొని కనిపించారు. ఆయనకు సంబంధించిన నాలుగైదు షాట్స్ టీజర్ లో ఉంచారు.
By: M Prashanth | 18 Sept 2025 7:17 PM ISTమలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ మోస్ట్ అవెయిటెడ్ సినిమా నుంచి ఇవాళ టీజర్ రిలీజైంది. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను షోభా కపూర్, ఏక్తా కపూర్, పద్మ కపూర్, వరుణ్ మథుర్, సురబీ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్ సంయుక్తంగా నిర్మించారు. 2025 దీపావళి సందర్భంగా సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సహా, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.
టీజర్ ఓవరాల్ గా 1.43 నిమిషాల నిడివి ఉంది. టీజర్ గ్రాండ్ బీజీఎమ్ తో షురూ అయ్యింది. ఓపెనింగ్ షాట్ లోనే భారీ నిర్మాణాలు చూపించారు. భారీ సెట్టింగులతో సినిమాను గ్రాండ్ గా డిజైన్ చేశారు. ఒక్క డైలాగ్ లేకుండానే టీజర్ ను ముగించారు. ఇందులో చిన్న పిల్లవాడి గుండెలపై ఓ ముద్ర వేసినట్లు చూపించారు. ఇందులో మోహన్ లాల్ చక్రవర్తిగాలా కనిపించనున్నారు.
మోహన్ లాల్ పొడవైన జుట్టుతో చేతిలో ఖడ్గం పట్టుకొని కనిపించారు. ఆయనకు సంబంధించిన నాలుగైదు షాట్స్ టీజర్ లో ఉంచారు. యోధుడిలా యుద్ధంలో పాల్గొన్న సీన్స్ ఆకట్టుకుంటు్న్నాయి. కత్తి పట్టుకొని శత్రువులను యుద్ధంలో సంహరిస్తున్న సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మోహన్ లాల్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది. మధ్యలో విధి పిలిచినప్పుడు, నెత్తురు కచ్చితంగా సమాధానం చెప్పాలి. అంటూ టెక్ట్స్ రూపంలో ఓ డైలాగ్ ఉంచారు.
రాజ్యానికి రాజుగా శత్రువులను చీల్చి చెండాడిన మోహన్ లాల్ ను టీజర్ ఆఖర్లో ఓ యువకుడి ఒడిలో నిద్రిస్తున్నట్లు చూపించారు. అంటే ఇందులో ఆయన రెండు పాత్రలు పోషిస్తున్నారా అని ఫ్యాన్స్ ఆనుకుంటున్నారు. ఓవరాల్ గా మంచి మ్యూజిక్, క్వాలిటీ విజువల్స్, భారీ సెట్టింగులతో టీజర్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా అదిరిపోయానని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.
ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోంది. ఈ సినిమా ఆయనకెంతో ప్రత్యేకమని మోహన్ లాల్ ఇప్పటికే చెప్పారు. ఈ సినిమా ఆయన అభిమానులకు అంకితం అని అన్నారు. అందరి మనసును సినిమా తాకుతుందని తెలిపారు. ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ స్థాయిలో వసూళ్లు చేస్తుందని అంచనాలు ఉన్నాయి. దీపావళి కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది.
