Begin typing your search above and press return to search.

అరుంధతి తమిళ్ రీమేక్.. హీరోయిన్ ఎవరంటే..?

స్వీటీ అనుష్క నటించిన అరుంధతి సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 2009 లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట డిస్కషన్ పాయింట్ అవుతుంది.

By:  Ramesh Boddu   |   19 Sept 2025 11:30 AM IST
అరుంధతి తమిళ్ రీమేక్.. హీరోయిన్ ఎవరంటే..?
X

స్వీటీ అనుష్క నటించిన అరుంధతి సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 2009 లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట డిస్కషన్ పాయింట్ అవుతుంది. అరుంధతి సినిమాలో అనుష్క నట విశ్వరూపం ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చింది. అంతేకాదు స్టార్ హీరోల సినిమాలకు ఈక్వెల్ రేంజ్ కలెక్షన్స్ అది రాబట్టింది. ఐతే అరుంధతి సినిమా కేవలం తెలుగులో మాత్రమే రిలీజైంది. ఆ సినిమా రీమేక్ ప్రయత్నాలు అప్పట్లో జరిగిన అవేవి ముందుకు సాగలేదు. ఐతే ఆఫ్టర్ 16 ఇయర్స్ మళ్లీ అరుంధతి రీమేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి.

రీమేక్ స్పెషలిస్ట్ మోహన్ రాజా..

అరుంధతి సినిమాను తమిళ్ లో రీమేక్ చేయబోతున్నారని టాక్. కోలీవుడ్ రీమేక్ స్పెషలిస్ట్ మోహన్ రాజా ఈ రీమేక్ ని చేస్తారట. ఐతే అరుంధతి రీమేక్ లో లీడ్ రోల్ ఎవరు అంటే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీలని తీసుకుంటున్నారని టాక్. మోహన్ రాజా ఏదైనా సినిమా రీమేక్ చేస్తే అది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. తెలుగు సినిమాలు చాలా తమిళ్ లో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు.

అరుంధతి సినిమా రీమేక్ అంటే ఆ సినిమా లవర్స్ అంతా కూడా క్రేజీగా ఫీల్ అవుతున్నారు. ఐతే అనుష్క ప్లేస్ లో శ్రీలీల నటించడం సర్ ప్రైజింగ్ థింగ్ అని చెప్పొచ్చు. ఈమధ్య ఆడియన్స్ ని ఎంత థ్రిల్ చేస్తే అంత సక్సెస్ అవుతున్నారు. అందుకే అనుష్క అరుంధతిని తమిళ్ లో రీమేక్ చేసి కోలీవుడ్ ఆడియన్స్ ని మెపించాలని చూస్తున్నారు. ఈ సినిమా పడితే మాత్రం శ్రీలీల కెరీర్ కి తమిళ్ లో మంచి బూస్టింగ్ దొరికే ఛాన్స్ ఉంటుంది.

తెలుగు తమిళ్ తో పాటు హిందీ సినిమాల్లోనూ శ్రీలీల..

ప్రస్తుతం శ్రీలీల ఇటు తెలుగు అటు తమిళ్ తో పాటుగా హిందీ సినిమాల్లోనూ నటిస్తుంది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల సూపర్ అనిపించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇలాంటి టైం లో అరుంధతి లాంటి సినిమా పడితే ఆమెకు మంచి క్రేజ్ వస్తుంది. ఐతే కేవలం తెలుగు సినిమానే అయినా అరుంధతి సినిమాను దాదాపు అందరు చూశారు. మరి అలాంటి అరుంధతి సినిమా ఇన్నేళ్ల తర్వాత ఎవరైనా చూస్తారా లేదా అన్నది చూడాలి.

అరుంధతి సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమా తమిళ్ రీమేక్ అంటే అక్కడ కూడా అదే రిజల్ట్ ఆశిస్తారు. ఇంతకీ మోహన్ రాజా అరుంథతి రీమేక్ చేస్తున్నారా లేదా.. ఈ రీమేక్ పై అఫీషియల్ అప్డేట్ బయటకు రావాల్సి ఉంది.