మోహన్ బాబును తొక్కేయాలని చూశారట..
అయితే సినిమా విడుదల తర్వాత మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
By: M Prashanth | 2 Oct 2026 2:53 PM ISTతొక్కేయాలని చూశారట.. కానీ చివరికి వాళ్లే తొక్కించుకున్నారట! సీనియర్ నటుడు మోహన్ బాబు చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ డిబేట్ ను స్టార్ట్ చేశాయి. ఇంతకీ ఆయనను తొక్కేయాలని చూసిందెవరు.. మోహన్ బాబు ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన ది ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు మెయిన్ విలన్ రోల్ లో కనిపించారు. షికాంజా మాలిక్ గా ఆయన కనిపించిన తీరు సినిమాపై ఇంట్రెస్ట్ పెంచింది. గతంలో ఎన్నో విలన్ పాత్రలు చేసిన మోహన్ బాబు.. ఆ సినిమాలో మాత్రం పూర్తిగా భిన్నమైన లుక్, బాడీ లాంగ్వేజ్ తో మెప్పించారు. ఆయన రోల్ కు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే సినిమా విడుదల తర్వాత మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి మోహన్ బాబు చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో సినీ జర్నీలో ఎదురైన ఇబ్బందులు గురించి చర్చ వచ్చింది. నెగిటివ్ టాక్, ఇబ్బందులు ప్రస్తావన రావడంతో మోహన్ బాబు తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు.
మన జర్నీలో ఆటంకాలు రావడం కామన్ అని.. వాటి వల్ల ఆగిపోతే ముందుకు వెళ్లలేమని ఆయన చెప్పారు. తమకు కూడా మామూలు ఆటంకాలు రాలేదని, మాట్లాడుతూనే ఉంటారని, తమను తొక్కేయాలని కొందరు ప్రయత్నించారని అన్నారు. అయితే తమను తొక్కేయాలని చూసిన వాళ్లే చివరికి తొక్కించుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు. మోహన్ బాబు చేసిన ఆ ఒక్క కామెంట్ తో ఇప్పుడు అసలు చర్చ మొదలైంది.
సినిమా విడుదల సమయంలో ది ప్యారడైజ్ కు యాంటీగా ఎవరైనా బిహేవ్ చేశారా.. లేక మోహన్ బాబు తన కెరీర్ లో ఎదురైన పాత ఎక్స్పీరియన్స్ లను గుర్తు చేసుకున్నారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే మోహన్ బాబు తన కామెంట్స్ లో ఎవరి పేరు ప్రస్తావించలేదు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని ఉద్దేశించి మాట్లాడారా, మరేదైనా సందర్భాన్ని గుర్తు చేసుకున్నారా అనే విషయంపై కూడా ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ప్యారడైజ్ సక్సెస్ మీట్ లో మోహన్ బాబు చేసిన మరో కామెంట్ వైరల్ అయింది. ఇండస్ట్రీ ఎవడి అబ్బా సొత్తు కాదంటూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు తొక్కేయాలని చూశారంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయన కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఆ రెండు విషయాలకు సంబంధం ఉందని మోహన్ బాబు ఎక్కడా చెప్పలేదు. కానీ ఆయన ఎవరి పేరు కూడా చెప్పకపోవడంతో అసలు కథ ఏంటన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది. మోహన్ బాబు ఎప్పుడైనా దీనిపై ఫుల్ క్లారిటీ ఇస్తారా అన్నది చూడాలి.
