ఆ క్యారెక్టర్.. శ్రీకాంత్, రాజమౌళి రేంజ్ లో చూపిస్తాడా?
మోహన్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
By: M Prashanth | 21 Sept 2026 11:19 PM ISTమోహన్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే యమదొంగ సినిమాలో యమధర్మరాజుగా ఆయన చేసిన మ్యాజిక్ మాత్రం చాలా స్పెషల్. 2007లో రాజమౌళి ఆయనలోని గంభీరతను, కామెడీ టైమింగ్ ను అద్భుతంగా వాడుకున్నాడు. యన్టీఆర్ కు ధీటుగా నిలబడే పాత్రలో మోహన్ బాబు విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాలు వచ్చినా ఆ స్థాయి ఇంపాక్ట్ అయితే మళ్లీ కనిపించలేదు.
బుజ్జిగాడు, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాల్లో ఆయన మార్క్ కనిపించినా పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు. ఆకాశమే నీ హద్దురా లాంటి వాటిలో మంచి క్యారెక్టర్స్ పడినా అవి నిడివి తక్కువ ఉన్నవి. అందుకే గత కొన్నేళ్లుగా ఆయన చాలా సెలెక్టివ్ గా కథలు వింటున్నారు. తన స్థాయికి తగ్గట్టుగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ గ్యాప్ లోనే ది ప్యారడైజ్ మూవీకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు షికంజా మాలిక్ అనే పవర్ ఫుల్ విలన్ గా నటించారు. ఈ క్యారెక్టర్ గురించి శ్రీకాంత్ ముందే ఒక మాట చెప్పాడు. మనం మిస్ అవుతున్న పాత మోహన్ బాబును ఇందులో చూపిస్తానని, ఇప్పటి జనరేషన్ కు ఆయన రేంజ్ ఏంటో పరిచయం చేస్తానని కాన్ఫిడెంట్ గా ప్రకటించాడు. కథ విన్న వెంటనే మోహన్ బాబు అంత ఎక్సైట్ అవ్వడానికి ఈ బ్రూటల్ క్యారెక్టరైజేషనే మెయిన్ రీజన్.
రాజమౌళి ఒకప్పుడు యమదొంగలో మోహన్ బాబు స్టైల్ ను మార్చకుండానే ఒక కొత్తదనం చూపించాడు. కానీ శ్రీకాంత్ ఓదెల మాత్రం ఆయన్ని కంప్లీట్ గా డార్క్ సైడ్ కు తీసుకెళ్తున్నాడు. ఈ సినిమా చూశాక నా దగ్గరకు రావడానికి కూడా భయపడతారని మోహన్ బాబు స్వయంగా చెప్పాడంటే ఈ క్యారెక్టర్ ఎంత వయొలెంట్ గా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ లో ఎన్నో నెగెటివ్ షేడ్స్ చేసిన ఆయన ఇంత గట్టిగా ఎప్పుడూ చెప్పింది లేదు.
ఈ కథలో జడల్ గా నాని, షికంజా మాలిక్ గా మోహన్ బాబు మధ్య వచ్చే ఫేస్ టు ఫేస్ సీన్స్ హైలైట్ కాబోతున్నాయని తెలుస్తోంది. ఈ కాంబో మీద హై లెవెల్ క్యూరియాసిటీ ఉంది. ఈ ఇద్దరి మధ్య నడిచే మైండ్ గేమ్, యాక్షన్ బ్లాక్స్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని మేకర్స్ చెబుతున్నారు. సెప్టెంబర్ 24న ది ప్యారడైజ్ థియేటర్లలోకి రాబోతోంది. యమదొంగ తర్వాత మోహన్ బాబుకు అంతటి బలమైన పాత్రను శ్రీకాంత్ ఓదెల ఇవ్వగలిగాడా లేదా అనేది స్క్రీన్ మీదే చూడాలి.
