Begin typing your search above and press return to search.

ఓణీల వేడుకలో మెరిసిన విద్య నిర్వాణ... మంచు లక్ష్మి ఎమోషనల్ మూమెంట్స్ వైరల్!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మనవరాలి ఈ సంప్రదాయ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తున్నాయి.ఆ విశేషాలు చూద్దాం..

By:  Madhu Reddy   |   20 March 2026 11:02 AM IST
ఓణీల వేడుకలో మెరిసిన విద్య నిర్వాణ... మంచు లక్ష్మి ఎమోషనల్ మూమెంట్స్ వైరల్!
X

మంచు వారసురాలు విద్యా నిర్వాణ అచ్చతెలుగు ఆడపడుచులా ముస్తాబైంది! తన 'చిట్టి తల్లి' ఓణీల వేడుక ఫోటోలను షేర్ చేస్తూ మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు. "నా కుటుంబమే నా బలం" అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మనవరాలి ఈ సంప్రదాయ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తున్నాయి.ఆ విశేషాలు చూద్దాం..




మురిసిపోయిన మంచు కుటుంబం:

హైదరాబాద్‌లో సీనియర్ నటులు మోహన్ బాబు మనవరాలు విద్యా నిర్వాణ ఓణీల వేడుక కన్నుల పండువగా జరిగింది. తెలుగు సంప్రదాయం ప్రకారం జరిపే ఈ వేడుకను మంచు కుటుంబం ఎంతో ఆత్మీయంగా నిర్వహించింది. ఈ వేడుకలో విద్యా నిర్వాణ పట్టు పరికిణి, ఓణీ ధరించి ఎంతో ముద్దుగా, నిండుగా కనిపించింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో మంచు లక్ష్మి తన కూతురిని చూసి మురిసిపోతూ ఎమోషనల్ అయ్యారు.




సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు:

మంచు ఫ్యామిలీ ఈ వేడుకను అధికారికంగా పెద్దగా ప్రకటించకపోయినా, లక్ష్మి షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విద్యా నిర్వాణ, ఇప్పుడు ఓణీ కట్టుకుని మరింత అందంగా కనిపిస్తోందని అభిమానులు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. "మా చిట్టి తల్లి పెరిగి పెద్దదైపోయింది" అంటూ మంచు లక్ష్మి తన ఆనందాన్ని పంచుకోవడంతో, మంచు ఫ్యామిలీ అభిమానులు విద్యా నిర్వాణకు దీవెనలు అందజేస్తున్నారు. ఇక ఈ వేడుకకు మంచు మోహన్ బాబు ,విష్ణు ఇద్దరు దూరంగా ఉండటం చర్చనీయాంశం అయింది. ఇక మంచు మనోజ్ ఫామిలీ అంతా తానే అయ్యి ఫంక్షన్ లో మెరిశారు.




మంచు లక్ష్మి కెరీర్ ముచ్చట్లు:

ఒక పక్క తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోపక్క మంచు లక్ష్మి సినిమాల్లోనూ బిజీగా ఉంటున్నారు. గత ఏడాది 'దక్ష' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన ఆమె, ప్రస్తుతం 'బూకీ' అనే తమిళ్-తెలుగు ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్‌గా తనదైన ముద్ర వేసిన లక్ష్మి, మారుతున్న కాలానికి అనుగుణంగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను ఆమె బ్యాలెన్స్ చేస్తున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.




ఆత్మీయ వేడుక - ఆనంద క్షణాలు:

ఈ ఓణీల వేడుకలో మంచు విష్ణు, మనోజ్ కుటుంబాలు కూడా సందడి చేసినట్లు తెలుస్తోంది. మంచు కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది.ఇక ఈ వేడుకకు సంబంధించిన వీడియోల్లో విద్యా నిర్వాణ చలాకీతనం చూస్తుంటే ఆమె కూడా భవిష్యత్తులో తల్లిలాగే ఇండస్ట్రీలో రాణిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.