పెళ్లి కబురే లేదంటే పిల్లలు కూడానా?
ప్రభాస్ తో నటించిన పలువురు అతనికి బర్త్ డే విషెస్ చెప్తూ డార్లింగ్ మంచితనాన్ని వర్ణిస్తుండగా, మోహన్ బాబు కూడా ప్రభాస్ కు విషెస్ చెప్తూ పోస్ట్ చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 23 Oct 2025 4:10 PM ISTటాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందు గుర్తొచ్చే పేరు ప్రభాస్. డార్లింగ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని కుటుంబ సభ్యులతో పాటూ అతని అభిమానులు, సాధారణ ఆడియన్స్, ఇంకా చెప్పాలంటే యావత్ చిత్ర పరిశ్రమే ఎదురుచూస్తోంది. ఎప్పటికప్పుడు ప్రభాస్ పెళ్లి ఈ ఇయర్ అనడమే తప్పించి అది ముందుకు మాత్రం కదలడం లేదు.
హోరెత్తుతున్న బర్త్ డే విషెస్..
అలాంటి ప్రభాస్ పుట్టినరోజు ఈరోజు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అతని అభిమానులు, సినీ సెలబ్రిటీలు డార్లింగ్ కు బర్త్ డే విషెస్ ను తెలుపుతూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ గురించే. ప్రభాస్ తో నటించిన పలువురు అతనికి బర్త్ డే విషెస్ చెప్తూ డార్లింగ్ మంచితనాన్ని వర్ణిస్తుండగా, మోహన్ బాబు కూడా ప్రభాస్ కు విషెస్ చెప్తూ పోస్ట్ చేశారు.
అరడజను పిల్లలతో సంతోషంగా ఉండాలని..
ప్రభాస్ ను మోహన్ బాబు బావ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తన ట్వీట్ లో కూడా ప్రభాస్ ను బావా అని సంబోధిస్తూ ఓ పోస్ట్ చేశారు. మై డియర్ డార్లింగ్ బావా.. నువ్వే దేశానికే గర్వ కారణం. నువ్వు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. అంతులేని సంతోషంతో జీవితాంతం ఆనందంగా ఉండాలి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి. అలాగే త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించి, అరడజను మంచి పిల్లల్ని కని సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. అని ట్వీట్ చేశారు.
డార్లింగ్ పెళ్లి కోసం బావ వెయిటింగ్
మోహన్ బాబు ట్వీట్ ను బట్టి చూస్తుంటే డార్లింగ్ పెళ్లి కోసం అందరితో పాటూ సెలబ్రిటీలు కూడా వెయిట్ చేస్తున్నారని అర్థమవుతుంది. ప్రస్తుతం మోహన్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఆయన ట్వీట్ కు పెళ్లి కబురే లేదంటే అప్పుడే పిల్లల వరకు వెళ్లిపోయారా అని కొందరు కామెంట్ చేస్తుంటే, ప్రభాస్ ను అలా ఊహించుకుంటే భలే ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
