Begin typing your search above and press return to search.

క‌మెడియ‌న్ కం టీవీ హోస్ట్‌కి MNS మాస్ వార్నింగ్

చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలను వాటి సరైన పేర్లతో పిలిచిన‌ప్పుడు మా నగరాన్ని ఎందుకు అవమానించాలి? ముంబై అని మాత్ర‌మే పిల‌వండి! అని హెచ్చ‌రించారు

By:  Sivaji Kontham   |   12 Sept 2025 12:08 PM IST
క‌మెడియ‌న్ కం టీవీ హోస్ట్‌కి MNS మాస్ వార్నింగ్
X

చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలను వాటి సరైన పేర్లతో పిలిచిన‌ప్పుడు మా నగరాన్ని ఎందుకు అవమానించాలి? ముంబై అని మాత్ర‌మే పిల‌వండి! అని హెచ్చ‌రించారు మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన ఫిల్మ్ వింగ్ చీఫ్ అమేయ ఖోప్క‌ర్. ఆయ‌న ముంబైలోని విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఈ హెచ్చరిక జారీ చేశారు. బాంబే అని బొంబై అని మా న‌గరాన్ని ఎవ‌రూ పిల‌వ‌కూడ‌దు. ముంబై అని మాత్ర‌మే పిల‌వాల‌ని ఆయ‌న సూచించారు. అలా జ‌ర‌గ‌ని ప‌క్షంలో మా ఆగ్ర‌హాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా క‌పిల్ శ‌ర్మ షోలో అతిథులు అలా పిలుస్తున్నారు. అది మాకు న‌చ్చ‌ద‌ని అన్నారు.

ఈ న‌గ‌రం పేరు ముంబై.. ఆ పేరుతో మాత్ర‌మే పిల‌వాలి. ఎవ‌రైనా మీ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వారికి మీరు ముందే చెప్పండి. బాంబే లేదా బొంబై అని కాదు, ముంబై అని పిల‌వాల‌ని చెప్పండి! అని క‌పిల్ శ‌ర్మ‌ను హెచ్చ‌రించారు. ఒక‌వేళ అలా కుద‌ర‌దు అని అనుకుంటే మా నుంచి చాలా నిర‌స‌న‌ను ఎదుర్కొంటారు.. అని కూడా ఖోప్క‌ర్ హెచ్చ‌రించారు.

స్థానిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇలా హెచ్చ‌రిస్తున్నారా? అని ప్ర‌శ్నించ‌గా, కొన్నేళ్లుగా ఈ ఉద్య‌మం చేప‌డుతున్నామ‌ని ఎంఎన్ఎస్ ఫిలిం చీఫ్ ఖోప్క‌ర్ తెలిపారు. ఎన్నిక‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని కూడా సూచించారు. మీరు ఇక్క‌డే పుట్టారు. ఇక్క‌డే ఎదిగారు.. ప‌ని చేస్తున్నారు. ఈ న‌గ‌రం గౌర‌వం పెంచాలి. త‌గ్గించ‌కూడ‌దు! అని కూడా అన్నారు. నేను క‌పిల్ శ‌ర్మ షో చాలా కాలంగా చూస్తున్నా.. ఎప్పుడూ అలానే పిలుస్తున్నారు. అందుకే హెచ్చ‌రిస్తున్నాము. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి ఇతర నగరాలను వాటి సరైన పేర్లతో పిలిచిన‌ప్పుడు మా నగరాన్ని ఎందుకు అవమానించాలి? అని ఎంఎన్ ఎస్ నాయ‌కుడు ఖోప్క‌ర్ అడిగారు.

క‌పిల్ శ‌ర్మ షోలో ముంబై అని పిల‌వ‌డం లేద‌ని కూడా ఆరోపించారు. ఈసారి కొత్త సీజ‌న్ ప్రారంభానికి ముందే మేం చాలా మంది బాంబే అని బొంబై అని పిల‌వ‌డం గ‌మ‌నించాము. దీనిని మేం తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాము. ఇది కేవ‌లం అభ్యంత‌రం కాదు కోపం! అని కూడా ఎంఎన్ఎస్ ఛీఫ్ అన్నారు. ఇదే క‌పిల్ శ‌ర్మ‌కు హెచ్చ‌రిక‌. మీ షోకి ఎవ‌రు వ‌చ్చినా ముందుగా వారికి చెప్పండి. బొంబై లేదా బాంబే అని పిల‌వ‌కూడ‌దు.... ముంబై అని మాత్ర‌మే పిల‌వాల‌ని చెప్పండి! అని వార్నింగ్ ఇచ్చారు. ముంబై న‌గ‌రం ప్ర‌జ‌ల హృద‌యాల‌లో ఉంది. ప్ర‌జ‌ల్ని అవ‌మానించొద్దు అని కూడా అన్నారు. కపిల్ శర్మ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కోసం `ది గ్రేట్ ఇండియన్ కపిల్` షో హోస్ట్ గా కొన‌సాగుతున్నారు. జూన్ 21నుంచి ఇది స్ట్రీమ్ అవుతోంది.