#GlobeTrotterEvent - మహేష్ ఫ్యాన్స్ గుండెల్లో ఫ్లాట్ కొన్నాను: ఎం.ఎం.కీరవాణి
స్టూడెంట్ నంబర్- 1 నుంచి ఆస్కార్ వరకూ నా తమ్ముడు రాజమౌళితో ప్రయాణంలో ఎన్నో వింతలు విడ్డూరాలు ఉన్నాయని అన్నారు మరకతమణి ఎం.ఎం.కీరవాణి.
By: Sivaji Kontham | 15 Nov 2025 10:23 PM ISTస్టూడెంట్ నంబర్- 1 నుంచి ఆస్కార్ వరకూ నా తమ్ముడు రాజమౌళితో ప్రయాణంలో ఎన్నో వింతలు విడ్డూరాలు ఉన్నాయని అన్నారు మరకతమణి ఎం.ఎం.కీరవాణి. మహేష్ తో రాజమౌళి సినిమా టైటిల్ లాంచ్ వేడుకలో కీరవాణి ఎమెషనల్ స్పీచ్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఆయన మాట్లాడుతూ-``రాజమౌళి ఆర్.ఆర్ఆర్ తో గ్లోబ్ కి వేరొకవైపు వెళ్లాము. గ్లోబ్ అంటే జస్ట్ అమెరికా కాదు. ఎన్నో ఖండాలు వింతలు.. వాటన్నిటినీ పూర్తి స్థాయిలో ఆవిష్కరించడానికి ఇప్పుడు `గ్లోబ్ ట్రాటర్`తో ప్రయత్నిస్తున్నాం. ఈ సినిమాలో వీటిలో కొన్నిటిని అయినా చూపించడానికి ధైర్యం చేసారు నిర్మాత కేఎల్ నారాయణ. ఆయనతో కలిసి రాజమౌళి ప్రయత్నం ఎగ్జయిట్ చేస్తోంది`` అని అన్నారు.
ధైర్యం అంటే గుర్తుకు వచ్చింది... ధైర్యే సాహసి లక్ష్మి.. తనను గౌరవించిన వారిని గౌరవిస్తూ, ధిక్కరించిన వారిని ధిక్కరిస్తూ ఇండస్ట్రీలో తన ధైర్యంతో ముందుకు సాగిన సూపర్ స్టార్ కృష్ణ గారికి నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఆయన వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబును ఇష్టపడతాను. మహేష్ పవర్ ఫుల్ డైలాగ్స్ కోసం.. నా మిత్రుడు మణిశర్మ మ్యూజిక్ కోసం `పోకిరి` సినిమాని ఎన్నిసార్లు చూసానో లెక్కే లేదు. పోకిరి నా ఫేవరెట్ మూవీ. కీరవాణిగారు మెలోడి బాగా అందిస్తాడు.. కానీ బీట్ బాగా స్లోగా ఉంటుందనే అపప్రద ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. కానీ ఈ సినిమాతో మెలోడీ నాదే.. ఫాస్ట్ బీటూ నాదే! అంటూ కీరవాణి ఎమోషనల్ గా మాట్లాడారు.
నేను ఈ మధ్య నేనొక కొత్త ఫ్లాటు కొన్నాను.. ఫ్లాటు అంటే హైదరాబాద్ లోనో, వైజాగ్ లోనో కాదు..మహేష్ అభిమానుల గుండెల్లో ఉండిపోయే ఫ్లాట్ కొన్నాను.. బిల్డర్ హ్యాండోవర్ చేసారు..నిర్మాత హ్యాపీ.. డైరెక్టర్ హ్యాపీ.. మెలోడీ నాదే.. ఫాస్ట్ బీటూ నాదే ... 2027 వేసవికే గృహ ప్రవేశం...! అంటూ మహేష్ ఫ్యాన్స్ ని గగ్గోలు పెట్టించారు కీరవాణి.
ఈ స్టోరీ చెబితే నా భార్య వల్లి తోలు తీస్తుంది అంటూ వేదికపై పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రను వేదికపై కీరవాణి పరిచయం చేసారు. ``ప్రపంచంలో నే అతి భయంకరమైన బలవంతుడైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక కల కన్నాడు. ఆ కలలో ఉన్న విషయాలు తెలుసుకుని జనం అతడిని పిచ్చోడు అని అనుకున్నారు. నవ్వుకున్నారు.. ఎగతాలి చేసారు.. కానీ ఆ కల వెనక ఉన్న ఒక కథ... ఆ కథ విన్న తర్వాత వారి గుండెల్లో గజగజ ఒణికే ట్విస్ట్ ఉంది. మంచు పర్వతాలు కరిగాయి. భయం పుట్టుకొచ్చింది.. అతడి ఆలోచన ఒక విలయం.. అతడి స్వప్నం ఒక ప్రళయం.. అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ విలనీ గురించి పరిచయం చేసిన తీరు నిజంగానే గగుర్పాటుకు గురి చేసింది. వారణాసి చిత్రంలో విలన్ పాత్ర ఎంత భీకరంగా క్రూరంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి కీరవాణి వర్ణన సరిపోతుంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి వారణాసి అనే టైటిల్ ని టీమ్ లాంచ్ చేసింది.
