Begin typing your search above and press return to search.

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి 22 కిలోల బరువు తగ్గడం చూసి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రశంసించారు. హైదరాబాద్‌లో కీరవాణిని కలిసిన ఆయన.. మేకోవర్‌కు సంబంధించిన బిఫోర్, ఆఫ్టర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కీరవాణి అంకితభావం తనకు స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

By:  Madhu Reddy   |   13 Nov 2026 2:04 PM IST
కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న కోడూరి మరకతమణి కీరవాణి అలియాస్ ఎమ్.ఎమ్.కీరవాణి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన సంగీతంతో శ్రోతలను అలరిస్తూ ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.అలాంటి ఈయన అంకిత భావం పై ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

కీరవాణి డెడికేషన్ పై ప్రశంసలు కురిపించిన అనుపమ్ ఖేర్..

నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న అనుపమ్ ఖేర్ హిందీ చిత్రాలకే తన నటనను పరిమితం చేయకుండా ఈమధ్య తెలుగు చిత్రాలలో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.అలాంటి ఈయన ఇటీవల నితీష్ తివారీ చిత్రంలో జటాయువు పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ఇక అలాంటి అనుపమ్ ఖేర్ తన పర్యటనలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ లో కీరవాణిని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్ట్ , పంచుకున్న క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోలతో పోస్ట్..

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తన అంకితభావంతో ఏకంగా 22 కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరిచారు . ఈ విషయాన్ని హైదరాబాదులో కీరవాణిని కలిసిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. ఆయన మేకోవర్ కి సంబంధించిన బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కీరవాణి అంకితభావం తనకు ఎంతో స్ఫూర్తిదాయకమని,ఆయన ఉత్సాహంగా కనిపిస్తున్నారని కొనియాడారు. మొత్తానికి అయితే ఏకంగా 22 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు . ఇక ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బరువు తగ్గడంలో కీరవాణి చూపిన డెడికేషన్ అభినందనీయం అంటూ ప్రశంసల కురిపిస్తున్నారు.

రామాయణ చిత్రంలో కీలకపాత్ర..

ఇకపోతే నితీష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం రామాయణంలో అనుపమ్ ఖేర్ కూడా భాగమయ్యారు. ఇందులో ఆయన జటాయువు పాత్రకు గాత్రం అందించడంతో పాటు నటుడిగా కూడా వ్యవహరించారు. ఈ పాత్రకు సంబంధించిన నాటక సన్నివేశాలు, ముఖ్యంగా సీతను రక్షించే ప్రయత్నంలో రావణుడితో ఆయన చేసిన పోరాటం, ప్రేక్షకుడికి మరింత ఆసక్తిని కలిగించాయి. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, రావణుడిగా యశ్ నటించగా , సాయి పల్లవి సీత పాత్ర పోషించారు..

ఇక అటు కీరవాణి విషయానికొస్తే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటను స్వరపరిచినందుకుగాను కీరవాణికి ఏకంగా ఆస్కార్ అవార్డు లభించింది. అలా భారతీయ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు ప్రసిద్ధ పేర్లను అనుపమ్ ఖేర్ ఒకే చోట చేర్చగలిగారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.