దుల్కర్ కొత్త మూవీ.. ఇదేం ట్విస్ట్?
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 11 Nov 2025 11:57 AM ISTమాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అటు లీడ్ రోల్స్ లో నటిస్తూ.. ఇటు ప్రొడ్యూసర్ గా సినిమాలను నిర్మిస్తున్నారు. అదే సమయంలో తెలుగు స్ట్రయిట్ మూవీలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. ఇప్పుడు కాంత మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా.. 1950 టైంలో మద్రాస్ ఇండస్ట్రీలో పరిస్థితులు, ఓ హీరో, ఓ డైరెక్టర్ మధ్య జరిగిన వివాదాల చుట్టూ తిరగనుంది. మూవీలో దుల్కర్ సినీ హీరోగా కనిపించనుండగా.. సముద్రఖని డైరెక్టర్ గా సందడి చేయనున్నారు. కీలక పాత్రలో హీరో రానా యాక్ట్ చేస్తున్నారు.
దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా.. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫెరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.
అయితే ఆడియన్స్ లో కాంత మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ సూపర్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. అయితే ఇప్పుడు మరో మూడు రోజుల్లో మూవీ విడుదల కానుండగా.. ఓ సీనియర్ అండ్ లెజెండరీ హీరో బయోపిక్ గా కాంత తెరకెక్కినట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
కోలీవుడ్ లెజెండ్ ఎంకే త్యాగరాజన్ లైఫ్ ఆధారంగా సెల్వరాజ్ కథ రాసుకున్నారని తమిళ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో నిజమెంతో తెలియకపోయినా.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే త్యాగరాజన్.. స్టేజ్ సింగర్ గా కెరీర్ ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు.
అదే సమయంలో ఓ మర్డర్ కేసులో వల్ల ఆయన జీవితం మలుపు తిరిగిందనే చెప్పాలి. ఆ ఉదంతంలో త్యాగరాజన్ నిర్దోషిగా బయటపడ్డారు. కానీ ఆ తర్వాత మళ్లీ ట్రాక్ లోకి రాలేకపోయారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు త్యాగరాజన్ జీవిత కథతో కాంత మూవీ రూపొందిందని ప్రచారం జరుగుతోంది. మరి అందులో నిజమెంతో తెలియాలంటే.. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన వరకు వేచి చూడాల్సిందే.
