Begin typing your search above and press return to search.

స్టార్ హీరో గొప్ప మనసు.. 116 కుక్కల కోసం మాన్షన్ బహుమతి..విలువ ఎంతంటే?

ఈయన బాలీవుడ్ లో పేరున్న హీరో..ఒకప్పుడు బాలీవుడ్ ని తన సినిమాలతో ఒక ఊపు ఊపారు.

By:  Madhu Reddy   |   19 Aug 2025 3:15 PM IST
స్టార్ హీరో గొప్ప మనసు.. 116 కుక్కల కోసం మాన్షన్ బహుమతి..విలువ ఎంతంటే?
X

సినిమా ఇండస్ట్రీలో ఉండే ఎంతోమందికి పెట్ డాగ్స్ అంటే ఇష్టం. ఇక కొంతమంది అయితే మనుషులకంటే ఎక్కువగా కుక్కల్నే ప్రేమిస్తారు. రీసెంట్ గా సుప్రీంకోర్టు వీధి కుక్కలపై ఇచ్చిన ఓ ఆర్డర్ వల్ల ఎంతోమంది పెట్ డాగ్ లవర్స్ బయటికి వచ్చి మరీ రోడ్లమీద పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ హీరోకి కుక్కలంటే విపరీతమైన ఇష్టం. ఎంతలా అంటే తన ఆస్తిలో ఉన్న సగభాగాన్ని రాసి ఇవ్వమన్నా రాసిస్తారట. ఇప్పటికే రూ.45 కోట్ల ఖరీదు చేసే ఇల్లుని కుక్కల పెంపకం కోసం ఇచ్చేసారట. మరి అంతలా కుక్కల్ని ప్రేమించే ఆ హీరో ఎవరు..? సొంత వారికే ఆస్తులు రాసివ్వని ఈ జనరేషన్లో కుక్కల కోసం రూ.45 కోట్ల ఆస్తి రాసివ్వడం ఏంటి? అంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

116 కుక్కలను పెంచుతున్న స్టార్ హీరో..

ఈయన బాలీవుడ్ లో పేరున్న హీరో..ఒకప్పుడు బాలీవుడ్ ని తన సినిమాలతో ఒక ఊపు ఊపారు. అలా స్టార్ హీరోగా రాణించిన ఈయన సౌమ్యుడుగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు మిథున్ చక్రవర్తి.. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఎందుకంటే ఈయన వెంకీ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన 'గోపాల గోపాల' మూవీలో స్వామీజీ పాత్రలో కనిపించారు. అయితే అలాంటి మిథున్ చక్రవర్తికి కుక్కలు అంటే విపరీతమైన ఇష్టమట. ఆయన ఇప్పటివరకు దాదాపు 116 కుక్కల్ని పెంచుతున్నారట. ఈ కుక్కల్లో తన సొంత కుక్కలతో పాటు తన ఫ్రెండ్స్ కుక్కల బాధ్యతలను కూడా తానే తీసుకున్నారట.

కుక్కల పెంపకం కోసం ప్రత్యేక జాగ్రత్తలు..

అలా మనుషులు ఎలా అయితే లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తారో కుక్కలకు కూడా అలాంటి లగ్జరీ లైఫ్ నే అందిస్తున్నారు. కుక్కల మీద ఉన్న తన ప్రేమకి గుర్తుగా ఒక చిన్న మినీ ఫామ్ హౌస్ నిర్మించి.. అందులో తన దగ్గర ఉన్న కుక్కల్ని పెంచుతున్నారట. అంతేకాదు ఈ కుక్కల కోసం సపరేట్ గా పని వాళ్ళను కూడా అరేంజ్ చేసినట్లు సమాచారం. వాటికి ఫుడ్ పెట్టడం, స్నానం చేయించడం వంటి అన్ని రకాల పనులు చేయిస్తారట. మిథున్ చక్రవర్తి కుక్కల కోసం కట్టిన ఆ ఇంట్లో స్పెషల్ గా టన్నెల్ తో పాటూ కుక్కలన్నీ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

116 కుక్కల కోసం 45 కోట్ల విలువ చేసే మాన్షన్..

అలా ముంబై సమీపంలో ఉండే మడ్ ఐలాండ్ లో ఉన్న తన 1.5 ఎకరాల భూమిలో 76 కుక్కల్ని పెంచుతున్నారట.. అంతేకాకుండా తాను సంపాదించిన ఆస్తిలో దాదాపు 45 కోట్ల ఆస్తిని 116 కుక్కల కోసం రాసిచ్చారట. అలా మిథున్ చక్రవర్తి కడుపున పుట్టిన పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటారో తన దగ్గర పెంచుకునే కుక్కల్ని కూడా అంతే ప్రేమగా చూసుకుంటారట. అలా ఈయన గొప్ప మనసు చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మిథున్ చక్రవర్తి పర్సనల్ డీటెయిల్స్..

మిధున్ చక్రవర్తి పర్సనల్ విషయానికి వస్తే..ఆయన ఇండస్ట్రీకి రాకముందు నుండే చాలా పేదరికం అనుభవించారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కూడా ఎన్నో ఇబ్బందులు పడి తినడానికి తిండి లేక, పడుకోడానికి ఇల్లు కూడా లేక రైల్వే స్టేషన్,ఫుట్ పాత్ ల మీద నిద్రపోయేవారట. అలా చివరికి ఇండస్ట్రీలో తన టాలెంట్ తో రాణించి దిగ్గజ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.

శ్రీదేవి కారణంగా వార్తల్లో నిలిచిన మిథున్ చక్రవర్తి..

ఈయన మరో విషయంలో కూడా వైరల్ అయ్యారు. అదే శ్రీదేవితో ఉన్న ఎఫైర్. గతంలో దివంగత నటి శ్రీదేవి, మిథున్ చక్రవర్తి ఇద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని,మిథున్ చక్రవర్తికి అప్పటికే పెళ్లయినా శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకున్నట్టు రూమర్స్ వినిపించాయి. కానీ ఇందులో ఉన్నది ఎంత నిజమో తెలియదు.