బన్నీ వాసు 'మిత్ర మండలి'.. ఎంత వసూలు చేయాలంటే?
టాలీవుడ్ యంగ్ క్యాస్టింగ్ ప్రియదర్శి, రాగ్ మయూర్, నిహారిక ఎన్ ఎం ప్రధాన పాత్రల్లో మిత్రమండలి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 15 Oct 2025 3:39 PM ISTటాలీవుడ్ యంగ్ క్యాస్టింగ్ ప్రియదర్శి, రాగ్ మయూర్, నిహారిక ఎన్ ఎం ప్రధాన పాత్రల్లో మిత్రమండలి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాలో ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు
ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా విజయేందర్ రెడ్డి తీగల సినిమాను నిర్మిస్తున్నారు. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజీవ్ కుమార్ రామ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా బాధ్యతలు వహించారు.
ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న మిత్రమండలి మూవీ.. దీపావళి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుంది. అక్టోబర్ 16వ తేదీన విడుదల కానుంది. అయితే ఆడియన్స్ లో సినిమాపై మంచి బజ్ ఉంది. మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు మిత్రమండలిపై అంచనాలను పెంచేశాయి. దీంతో మూవీ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
అదే సమయంలో సినిమా బడ్జెట్ కోసం డిస్కస్ చేసుకుంటున్నారు. రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఈవెంట్స్ తో మిత్రమండలి సినిమాకు దాదాపు 5 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఆంధ్ర, నైజాం, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ రైట్స్ కలిపి మిత్రమండలి మూవీకి రూ.5 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో సినిమా లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్ గా రూ.10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. ఇప్పటికే ఓటీటీ రైట్స్ ను మేకర్స్ సాలిడ్ నెంబర్స్ కు సేల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో మిత్రమండలి నిర్మాతలు సేఫ్ జోన్ లోనే ఉన్నారని అర్థమవుతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం పక్కా అనే చెప్పాలి.
అయితే కంటెంట్ పై నమ్మకంతో మేకర్స్ ప్రీమియర్స్ వేస్తున్నారు. కాబట్టి మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే.. సినిమాపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. కామెడీకి మెచ్చి ప్రజలు నవ్వకుంటే.. దీపావళి పండుగ కలిసి వస్తుంది. అప్పుడు చిన్న బడ్జెట్ తో రూపొందిన మిత్ర మండలి పెద్ద విజయం సాధిస్తుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
