Begin typing your search above and press return to search.

మిత్రమండలి.. ఓటీటీలో తెగ చూస్తున్నారుగా!

టాలీవుడ్ యువ నటుడు ప్రియదర్శి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ నిహారిక ఎన్‌ ఎం లీడ్ రోల్స్ లో రూపొందిన మిత్ర మండలి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   9 Nov 2025 5:00 PM IST
మిత్రమండలి.. ఓటీటీలో తెగ చూస్తున్నారుగా!
X

టాలీవుడ్ యువ నటుడు ప్రియదర్శి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ నిహారిక ఎన్‌ ఎం లీడ్ రోల్స్ లో రూపొందిన మిత్ర మండలి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రాగ్ మయూర్‌, ప్రసాద్ బెహరా, విష్ణు ఓయ్‌ కీలక పాత్రల్లో నటించిన ఆ సినిమాను కామెడీ డ్రామాగా విజయేందర్ ఎస్ తెరకెక్కించారు.




ప్రముఖ నిర్మాత బన్నీ వాస్‌ సమర్పణలో బీవీ వర్క్స్‌ బ్యానర్‌ పై కల్యాణ్‌ మంథిన, భాను ప్రతాప, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించిన మిత్ర మండలి మూవీ.. దీపావళి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా.. అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయింది.

బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది. టాప్ ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఇటీవల పాపులర్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన మిత్ర మండలి.. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

అయితే ఓటీటీలో మిత్రమండలి మూవీని సినీ ప్రియులు తెగ చూస్తున్నారు. మేకర్స్‌ కొన్ని పోర్షన్లు తొలగించి రీఎడిటెడ్‌ వెర్షన్‌ ను ఓటీటీలో విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఇండియా చార్ట్స్‌ లో మిత్రమండలి ఇటీవల ఐదో స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండో స్థానానికి చేరుకుంది.

దీంతో మేకర్స్ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. మ్యాడ్నెస్ ఇప్పుడిప్పుడే పెరుగుతుందని తెలిపారు. మిత్రమండలి మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్-2 స్థానానికి చేరుకుందని చెప్పారు. అభిమానులు అందరూ రీకట్ వెర్షన్ లోని ఎనర్జీతోపాటు కామెడీకి అట్రాక్ట్ అవుతున్నట్లు పేర్కొన్నారు.

ఇక సినిమా కథ విషయానికొస్తే.. జంగ్లీప‌ట్నానికి చెందిన నారాయ‌ణ (వీటీవీ గ‌ణేశ్‌)కు త‌న కులం అంటే పిచ్చి. ఆయన త‌న కుల బ‌లంతో ఎమ్మెల్యే కావాల‌నుకుంటారు. కానీ అప్పుడే ఆయన కూతురు స్వేచ్ఛ (నిహారిక) ఇంటి నుంచి పారిపోతుంది. దీంతో పరువు పోతుందని.. కిడ్నాప్ అయ్యిందంటూ వెతుకుతారు. అయితే ఆ విషయం వెన‌క అదే ప్రాంతానికి చెందిన న‌లుగురు కుర్రాళ్లు ఉన్న‌ట్టు తేలుతుంది. దీంతో అసలేం జరిగింది? హీరోయిన్ కార‌ణంగా వారు ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు? అనేది పూర్తి చిత్రం.