ఆ నలుగురు దొంగనాకొడుకులు: బన్నీ వాసు
నటులు, దర్శకులు మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By: M Prashanth | 14 Oct 2025 11:05 AM ISTనటులు, దర్శకులు మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, కొన్నిసార్లు సరదాగా మాట్లాడిన విషయాలు కూడా ఊహించని విధంగా హాట్ టాపిక్‌గా మారుతాయి. తాజాగా, నిర్మాత బన్నీ వాసు తన క్లోజ్ ఫ్రెండ్స్‌ను సరదాగా చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. దీపావళికి ముందు రిలీజ్ అవుతున్న తన సినిమా 'మిత్రమండలి' ఈవెంట్‌లో, బన్నీ వాసు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
ట్రోలింగ్‌పై గట్టి సమాధానం
బన్నీ వాసు సమర్పణలో వస్తున్న 'మిత్రమండలి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు హాజరైన బన్నీ వాసు.. ముందుగా సినిమా ట్రోలింగ్‌పై గట్టిగా స్పందించారు. "ట్రోలింగ్ చేసేవాళ్లు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మీలోని పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్‌గా మార్చడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి." అని ఆయన సరదాగా అన్నారు. అలాగే, "సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ ట్రోలింగ్ చేయించాలి కదా, అందుకు మేం సిద్ధంగా ఉన్నాం" అంటూ ట్రోలింగ్ చేయించేవారికి కూడా చురకలు అంటించారు.
దొంగనా కొడుకులు కామెంట్స్ వైరల్
అయితే ఈ వేదికపై బన్నీ వాసు చేసిన 'దొంగనా కొడుకులు' కామెంట్స్ వైరల్‌గా మారాయి. యాంకర్ సుమ, బన్నీ వాసుని తన జీవితంలో 'మిత్రమండలి' అనిపించే నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పమని అడగ్గా, ఆయన వెంటనే "అంటే నాతో తిరిగే నలుగురు దొంగనా కొడుకులని చెప్పమంటారా?" అని సరదాగా అన్నారు.
మారుతి, SKN పేర్లు మెన్షన్
అనంతరం బన్నీ వాసు వారి పేర్లు చెబుతూ.. SKN (నిర్మాత)ని మొదటి దొంగ నా కొడుకుగా పేర్కొన్నారు. రెండవ వ్యక్తిగా.. "ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారు కాబట్టి గౌరవంగా మారుతి గారు అంటాను" అని నవ్వుతూ చెప్పారు. మూడవ వ్యక్తిగా తన చిన్ననాటి స్నేహితుడు, 'మిత్రమండలి' నిర్మాత భానుని, నాలుగవ వ్యక్తిగా వరుణ్ దగ్గర ఉండే ఆర్కేని చెప్పాడు.
మా నలుగురు హిస్టరీ..
"మా నలుగురు హిస్టరీ తీస్తే మిత్రమండలి సరిపోదు, అంత దారుణంగా ఉంటుంది" అని బన్నీ వాసు సరదాగా చెప్పారు. ఈ కామెంట్స్‌తో ఈవెంట్‌కు వచ్చిన వారిని, ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. అయితే, స్టేజ్ మీద దర్శకులను, నిర్మాతలను సరదాగా అయినా సరే ఇలాంటి పదంతో సంబోధించడం అనేది సోషల్ మీడియాలో మరింత వైరల్ అయింది. మొత్తానికి, బన్నీ వాసు తన క్లోజ్ ఫ్రెండ్స్‌పై సరదాగా చేసిన ఈ మాస్ కామెంట్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అదనపు బజ్‌ను తెచ్చిపెట్టాయి. ఈ కామెంట్లు వైరల్ అవ్వడంతో, 'మిత్రమండలి' సినిమాపై మరింత మంది దృష్టి పడింది. ప్రియదర్శి నిహారిక ఎన్‌ఎం జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 16న విడుదల కానుంది.
