Begin typing your search above and press return to search.

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న మాజీ మిస్ వరల్డ్!

సాధారణంగా ఇండస్ట్రీలోకి రావాలి అంటే మోడల్ గా కెరియర్ను ఆరంభించి.. ఆ తర్వాత హీరోయిన్గా అవతరించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

By:  Madhu Reddy   |   3 Feb 2026 8:00 PM IST
క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న మాజీ మిస్ వరల్డ్!
X

సాధారణంగా ఇండస్ట్రీలోకి రావాలి అంటే మోడల్ గా కెరియర్ను ఆరంభించి.. ఆ తర్వాత హీరోయిన్గా అవతరించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఆ మోడల్గా కెరియర్ మొదలుపెట్టినా.. తమ అందంతో ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షించి ఆ తర్వాత సినిమాల్లోకి వస్తున్నారు. ఇప్పటికే ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా లాంటివాళ్ళు తమ అందంతో ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షించడమే కాకుండా మిస్ వరల్డ్ గా కిరీటాన్ని దక్కించుకొని.. ఇప్పుడు సినిమాలలో కూడా స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.




ఇప్పుడు అలాంటి జాబితాలో మరో ముద్దుగుమ్మ కూడా చేరిపోయిన విషయం తెలిసిందే. ఆమె మానుషి చిల్లర్. 2017 మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొని విజేతగా నిలిచి, అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలాంటి ఈమె 2017 ఫెమినా మిస్ ఇండియా పోటీలో హర్యానా రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి మిస్ ఇండియా వరల్డ్ 2017 టైటిల్ ని కూడా గెలుచుకుంది. 17 సంవత్సరాల తర్వాత మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఆరవ భారతీయురాలిగా కూడా రికార్డు సృష్టించింది మానుషి చిల్లర్. తన అందంతో అందరినీ ఆకట్టుకున్న ఈమె తొలిసారి 2022లో 'సామ్రాట్ పృథ్వీరాజ్' అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత 2023లో ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ , 2024లో బడే మియాన్ చోటే మియాన్ వంటి చిత్రాలలో కనిపించి సందడి చేసింది.




ఈమధ్య ఇంస్టాగ్రామ్ వేదికగా కూడా కొన్ని ఫోటోలను పంచుకుంటూ అభిమానులను తన అందంతో గిలిగింతలు పెడుతోంది. అందులో భాగంగానే తాజాగా మరోసారి ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అందులో వెకేషన్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆరంజ్ కలర్ బికినీ ధరించిన ఈమె దానిపైన నెట్ తో డిజైన్ చేసిన మెష్ దుస్తులలో తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. ఒక రాతి స్తంభానికి ఆనుకొని స్టైలిష్ గా డ్రింక్ సేవిస్తూ.. తన హుందాతనాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. ఇక మరొక ఫోటోలో తన పెట్ డాగ్ తో ఆప్యాయతగా ఉన్నట్టు మరో ఫోటో పంచుకుంది. ఇలా వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకున్న ఈమె అందులో తన అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మానుషి 1997 మే 14న రోహ్ తక్ లోని హర్యాన్వి కుటుంబంలో జన్మించింది. ఈమె పూర్వీకులు బమ్నోలి గ్రామానికి చెందినవారు. మానుషి చిల్లర్ తండ్రి మిత్రా బసు చిల్లర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో వైద్యుడిగా పనిచేశారు. ఇప్పుడు ముంబైలోని సోమ వెల్నెస్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఈమె తల్లి నీలం చిల్లర్. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ లో వైద్యురాలిగా పనిచేయడమే కాకుండా న్యూరో కెమిస్ట్రీ విభాగంలో హెడ్ గా పనిచేస్తున్నారు.

ఈమె 12వ తరగతిలోనే ఇంగ్లీష్ సబ్జెక్టులో ఆల్ ఇండియా సీబీఎస్ఈ లో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే 96% ఇంటర్లో స్కోర్ కూడా చేసింది. మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్(NEET) లో ఉత్తీర్ణత సాధించి ఎంబిబిఎస్ చదువుతోంది. ఇక ఈమె కూచిపూడి నృత్యకారిణి కూడా.