OTTలో కల్ట్ హిట్.. థియేటర్‌లో చూస్తారా?
ప్రైమ్ వీడియోలో మూడు సీజన్లతో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న మిర్జాపూర్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ పైకి వస్తోంది. సెప్టెంబర్ 4న ‘మిర్జాపూర్: ది మూవీ’ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
By: M Prashanth | 15 Aug 2026 6:00 AM ISTప్రైమ్ వీడియోలో మూడు సీజన్లతో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న మిర్జాపూర్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ పైకి వస్తోంది. సెప్టెంబర్ 4న ‘మిర్జాపూర్: ది మూవీ’ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ నుంచి వచ్చిన డిమాండ్ వల్లే ఈ క్రైమ్ డ్రామా ఫ్రాంచైజీని సినిమాగా తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు నిర్మాత ఫర్హాన్ అక్తర్ రీసెంట్‌గా చెప్పారు. ఓటీటీలో సూపర్ సక్సెస్ అయిన ఒక సిరీస్‌ను ఇలా థియేట్రికల్ ఫిల్మ్‌గా తీసుకు రావడం హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటివరకు ఆడియన్స్ ఈ గ్యాంగ్‌స్టర్ కథను ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా తమ ఇంట్లోనే ఫోన్లు, టీవీ స్క్రీన్లలో చూశారు. కాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా భయ్యా లాంటి క్యారెక్టర్లు జనాల్లో బాగా పాపులర్ అయ్యాయి. అయితే ఒక రెగ్యులర్ సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీలో సులభంగా చూసిన కంటెంట్ కోసం ఇప్పుడు ప్రేక్షకులు ప్రత్యేకంగా టికెట్ కొని థియేటర్‌కు వస్తారా అనేది అసలైన పాయింట్.
రీసెంట్‌గా ఈ అంశంపై పంకజ్ త్రిపాఠి కూడా స్పందించారు. సిరీస్‌ను జనాలు ఒంటరిగా పర్సనల్ స్పేస్‌లో చూస్తారని, సినిమా అయితే వెండితెరపై అందరితో కలిసి చూసే కలెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. స్క్రీన్ సైజ్ మారినప్పుడు ఈ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్స్ ఇచ్చే ఇంపాక్ట్ ఎలా ఉంటుందనే చర్చ కూడా సినిమా లవర్స్‌లో గట్టిగానే నడుస్తోంది.
సినిమా ప్రమోషన్స్ పరంగా ఆడియన్స్‌లో అవగాహన కల్పించడం టీమ్‌కి పెద్ద కష్టం కాకపోవచ్చు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు పాత్రలకు ఇప్పటికే ప్రేక్షకుల్లో బలమైన రికాల్ వాల్యూ ఉంది. ఓటీటీ ఆడియన్స్‌కు ఈ మిర్జాపూర్ ప్రపంచం మొత్తం చాలా బాగా తెలుసు. కానీ ఓటీటీలో ఉన్న ఆ క్రేజ్ థియేటర్ల దగ్గర టికెట్ సేల్స్‌గా ఎంతవరకు కన్వర్ట్ అవుతుందనేదే ఈ ప్రాజెక్ట్‌కి ఉన్న అసలైన టెస్ట్.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అయితే భవిష్యత్తులో ఇతర పాపులర్ ఇండియన్ ఓటీటీ కంటెంట్ లను కూడా ఫీచర్ ఫిల్మ్స్‌గా మార్చే ఆలోచనలకు మంచి కాన్ఫిడెన్స్ దొరుకుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సక్సెస్ సాధించిన కంటెంట్‌ను థియేట్రికల్ మార్కెట్‌కి విస్తరించే అంశంపై మేకర్స్‌లో చర్చ మొదలవుతుంది. కంటెంట్ క్రియేటర్లకు సరికొత్త ఆలోచనలతో బిగ్ స్క్రీన్ వైపు రావడానికి ఇది ఒక మంచి బూస్ట్ ఇస్తుంది.
అయితే ఇదంతా సెప్టెంబర్ 4న ప్రేక్షకులు ఇచ్చే తుది తీర్పు మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడకపోతే, స్ట్రీమింగ్ పాపులారిటీని థియేటర్ టికెట్ కలెక్షన్లుగా మార్చడం అంత తేలికైన విషయం కాదని అంటారు. ఇక ఈ సరికొత్త ప్రయోగం ఇచ్చే ఫలితం ఎలా ఉండబోతుందో తెలియాలంటే రిలీజ్ రోజు వరకు వేచి చూడాల్సిందే.
