సక్సెస్ అయితే మరిన్ని సంచలనాలు!
క్రైమ్ థ్రిల్లర్..సస్పెన్స్ థ్రిల్లర్లు ..రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ లు..డాక్యుమెంటరీలకు ఓటీటీలో ఏ స్థాయిలో ఆదరణ దక్కుతుందో కనిపిస్తూనే ఉంది.
By: Srikanth Kontham | 7 Feb 2026 1:00 AM ISTసినిమా ని మించి ఓటీటీ కంటెంట్ రూల్ చేస్తోంది అన్నది కాదనలేని నిజం. క్రైమ్ థ్రిల్లర్..సస్పెన్స్ థ్రిల్లర్లు ..రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ లు..డాక్యుమెంటరీలకు ఓటీటీలో ఏ స్థాయిలో ఆదరణ దక్కుతుందో కనిపిస్తూనే ఉంది. సినిమా కంటెంట్ ని మించి ఓటీటీ కంటెంట్ హైలైట్ అవుతుంది. పైగా ఓటీటీ కంటెంట్ ప్రపంచ వ్యాప్తంగా రీచ్ అవుతుంది. దీంతో వెబ్ సిరీస్ లు..డాక్యుమెంటరీలకు అదరణ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇతర విదేశీ భాషల్లోకి ఇండియన్ కంటెంట్ డంప్ అవ్వడం చూడొచ్చు.
`మీర్జాపూర్` వెబ్ సిరీస్ ఓటీటీలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన `మీర్జాపూర్` యువతను విశేషంగా ఆకట్టుకుంది. మీర్జాపూర్ నుంచి రిలీజ్ అయిన మూడు సీజన్లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. తాజాగా ఇప్పుడీ సీరీస్ ను వెండి తెరపైకి సినిమా రూపంలో తీసుకొస్తున్నారు. `మీర్జాపూర్ : ది మూవీ` పేరుతో భారీ ఎత్తున థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్- ఎక్స్ ఎంల్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న `మీర్జాపూర్` సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. మూడు సిరీస్ లకు ఇది ప్రీక్వెల్ గా ఉండబోతుంది. మూడు సీజన్లలో నటించిన నటీనటులే సినిమాలోనూ భాగమయ్యారు. దర్శక, నిర్మాతలు సినిమాగా తీసుకొస్తున్న ఈ సిరీస్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. థియేటర్లో సైతం గ్రాండ్ విక్టరీ నమోదు చేస్తుందని ఆశీస్తున్నారు. అదే జరిగితే థియేట్రికల్ గా మరిన్ని వెబ్ సిరీస్ లు రిలీజ్ అవ్వడం ఖాయం. `సేక్రేడ్ గేమ్స్`, `ది ఫ్యామిలీ మ్యాన్` ,`పాాతాళ్ లోక్`, `స్కామ్ 1992`, `ఢిల్లీ క్రైమ్`, `పంచాయత్`, `కోటా ఫ్యాక్టరీ`, `ఫర్జీ`, `అసుర్` లాంటి వెబ్ సిరీస్ లు సినిమాలగా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం లేకపోలేదు.
ఈ వెబ్ సిరిస్ లు దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన సిరీస్ లు. కోట్లాది మంది వీక్షించారు. ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ఉంది. ఈ సిరీస్ లకు కొనసాగింపు, సీక్వెల్స్ , ప్రీక్వెల్స్ రావాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఒకవేళ అందుకు ఆస్కారం లేకపోతే? రెండున్నర గంటల నిడివితో సిరీస్ లు అన్నింటిని కలిపి సినిమా గా తీసినా ఆస్వాదించడానికి సిద్దంగా ఉన్నారు. అలాగే భారత్ లో యానిమేషన్ చిత్రాలకు కూడా ఆదరణ మొదలైంది. ఆ మధ్య రిలీజ్ అయిన `మహావతార్ నరసింహ`కు విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.
అప్పటి వరకూ యానిమేషన్ చిత్రాలంటే ఆడియన్స్ లైట్ తీసుకునే వారు. కానీ త్రీడీ ఫార్మెట్ లో రిలీజ్ అవ్వడం భక్తి నేపథ్యం గల కంటెంట్ కావడంతో కోట్లాది మంది ఆదరించారు. యానిమేషన్ రూపంలో ఇప్పటికే చాలా కంటెంట్ ఉంది. పెరిగిన టెక్నాలజీ యుగంలో వాటిని సినిమాలగా తీస్తే మంచి ఆదరణ లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
