Begin typing your search above and press return to search.

టాక్: పెద్ద తెరపై మిర్జాపూర్ బ్యాచ్ ఎలా ఉంది?

‘మిర్జాపూర్’ సిరీస్ చూసిన వాళ్లకు కాలీన్ భయ్యా, గుడ్డు, బబ్లూ క్యారెక్టర్ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  M Prashanth   |   5 Sept 2026 1:37 PM IST
టాక్: పెద్ద తెరపై మిర్జాపూర్ బ్యాచ్ ఎలా ఉంది?
X

‘మిర్జాపూర్’ సిరీస్ చూసిన వాళ్లకు కాలీన్ భయ్యా, గుడ్డు, బబ్లూ క్యారెక్టర్ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే బ్యాచ్‌ను తీసుకుని సినిమా చేశారు. అయితే మూడు సీజన్ల కథను కొనసాగించకుండా, తెలిసిన క్యారెక్టర్లతో మరో పవర్ గేమ్ పెట్టారు. ఇక సినిమాకు పబ్లిక్ నుంచి ఎలాంటి టాక్ వస్తోంది అనే వివరాల్లోకి వెళితే.. తెలిసిన పాత్రలు ఉండడం వలన సిరీస్ ఫ్యాన్స్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా చూసేవాళ్లకు కూడా కథ అర్థం కాకుండా ఉండేంత లింకులు పెట్టలేదనే మాట వినిపిస్తోంది.

ఫస్ట్ హాఫ్ మొదట్లో మాత్రం సినిమా కాస్త టైమ్ తీసుకుంటుందట. ఎవరు మిర్జాపూర్ సింహాసనం కోసం వస్తున్నారు, కాలీన్ భయ్యా చుట్టూ ఎవరు ఉన్నారు, కొత్త శత్రువు లెక్క ఏంటి అన్నది సెట్ చేయడానికి ఎక్కువ సీన్లు పెట్టారట. క్యారెక్టర్లు తెలిసిన వాళ్లు ఆ పార్ట్‌ను ఈజీగా తీసుకుంటున్నారు కానీ, కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్లకు అక్కడ కాస్త స్లోగా అనిపిస్తోందని కామెంట్స్ వస్తున్నాయి.

సినిమాలో ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అసలు కథ స్టార్ట్ అవుతుంది. అప్పటివరకు వేసిన సెటప్‌కు అసలు ప్రమాదం ఏంటో అక్కడ బయటపడుతుంది. సెకండాఫ్‌లో మాస్ మూమెంట్స్, గన్ ఫైట్స్, పాత మిర్జాపూర్ టచ్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే చివరలో కొన్ని సన్నివేశాలు ఊహించనట్లే నార్మల్ గా ఉండడం వల్ల ఇంటర్వెల్ దగ్గర వచ్చిన టెన్షన్ అంతగా కొనసాగలేదనే మాట కూడా వినిపిస్తోంది.

పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు తమ పాత పాత్రల్లోకి మళ్లీ ఈజీగా వెళ్లిపోయారట. బబ్లూ పాత్రలో విక్రాంత్ మస్సే స్థానంలో జితేంద్ర కుమార్ రావడం మాత్రం ముందే చిన్న డౌట్ ఇచ్చింది. కానీ పాత నటుడిని కాపీ చేయకుండా తన స్టైల్‌లో చేశాడని అంటున్నారు. కొత్తగా వచ్చిన రవికిషన్ విలన్ పాత్రలో తన మార్క్ చూపించాడట. రసిక దుగల్‌కు కూడా ఈసారి మంచి స్పేస్ దొరికిందని టాక్.

టెక్నికల్‌గా పాజిటివ్ గా వినిపిస్తున్నది మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించే. మిర్జాపూర్ థీమ్ బిగ్ స్క్రీన్ పై మంచి కిక్ ఇస్తోందట. రాజస్థాన్ లొకేషన్స్ కూడా సిరీస్‌తో పోలిస్తే సినిమాకు కొత్త లుక్ ఇచ్చాయని చెబుతున్నారు. పాటలు ఉన్నా ఎక్కువగా మాంటేజ్‌ల్లోనే వాడటంతో ఫ్లోను ఆపలేదట. కానీ రన్‌టైమ్ విషయంలో మాత్రం కాస్త ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా షార్ప్‌గా ఉండేదనే కామెంట్ వస్తోంది.

తెలుగు డబ్బింగ్ చూసిన వాళ్లకు మరో తేడా కూడా కనిపిస్తుందట. సిరీస్‌లో బాగా ఫేమస్ అయిన బూతుల డోస్ ఈసారి చాలా తగ్గించారు. కొన్ని మాటలు తప్ప ఆ పాత హడావుడి లేదు. అలాగే మూడు సీజన్లు చూసి రావాల్సిందే అన్న కండిషన్ కూడా పెట్టలేదు. మిర్జాపూర్ ప్రపంచం గురించి ఏమీ తెలియని వాళ్లు కూడా డైరెక్ట్ సినిమా చూసేలా కథను సెట్ చేశారు. ఓ వర్గం నుంచి సినిమాకు డీసెంట్ టాక్ అయితే వస్తోంది. ఇక రానున్న రోజుల్లో జనాలు ఈ టాక్ ద్వారా మరింత ఎట్రాక్ట్ అవుతారో లేదో చూడాలి.