Begin typing your search above and press return to search.

నిఖార్సైన‌ యూపీ కూతురు..నటి శ్వేతా త్రిపాఠి మనసులో మాట!

`మిర్జాపూర్` సిరీస్‌లో గజగామిని గుప్తా (గోలు) పాత్రతో దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శ్వేతా త్రిపాఠి నటనా కౌశలంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

By:  Srikanth Kontham   |   27 Oct 2026 9:17 AM IST
నిఖార్సైన‌ యూపీ కూతురు..నటి శ్వేతా త్రిపాఠి మనసులో మాట!
X

'మిర్జాపూర్' సిరీస్‌లో గజగామిని గుప్తా (గోలు) పాత్రతో దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శ్వేతా త్రిపాఠి నటనా కౌశలంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ డిజిటల్, సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం ..పెంపకం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిఖార్సైన అమ్మాయినని శ్వేతా త్రిపాఠి గర్వంగా చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీలో పుట్టి పెరిగినప్పటికీ తన రక్తంలో ..ఆలోచనల్లో యూపీ సంస్కృతి, మూలాలు బలంగా నాటుకుపోయాయని తెలిపింది.

చిన్నతనం నుంచే సాధార‌ణ‌ జీవితం..స్పష్టమైన విలువలు ..బలమైన పట్టుదలతో పెరగడం వల్లే నటనలో నిజాయితీని చూపించ గలుగుతున్నానని పేర్కొంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో లభించిన స్వేచ్ఛ .. క్రమశిక్షణే తనను బలమైన వ్యక్తిగా మార్చాయని శ్వేత స్పష్టం చేసింది. సమాజం విధించే పరిమితులను పక్కన పెట్టి స్వతంత్రంగా ఆలోచించే తత్వాన్ని తన తల్లిదం డ్రులు నేర్పించారని..అదే తనను సినీ పరిశ్రమలోకి వచ్చేలా ధైర్యాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించింది. యూపీ సం స్కృతిలోని సహజత్వం ప్రతి పాత్రలో ప్రతిబింబిస్తుందని చెప్పింది.

కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సమాజంలో ప్రభావం చూపే బలమైన పాత్రలనే ఎంచుకోవడం శ్వేత ప్రత్యేకత. `మసాన్`, `హరామ్‌ఖోర్`, `మిర్జాపూర్` వంటి ప్రాజెక్ట్‌లు ఆమెలోని నటన పట్ల నిబద్ధతను నిరూపించాయి. కథలో సత్తా ఉంటేనే సినిమా లేదా సిరీస్‌ను అంగీకరిస్తానని.. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం ముఖ్యమని అభిప్రాయపడింది.

సినీ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో యూపీ మూలాలు తనకు కొండంత అండగా నిలిచాయని వెల్లడించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరచిపోకూడదనే సిద్ధాంతాన్ని తాను గట్టిగా నమ్ముతానని.. ప్రేక్షకుల నుంచి లభించే ప్రేమాభిమానాలే తనలోని నటిని నిరంతరం కొత్తగా ఆవిష్కరించు కోవడానికి ఇంధనంగా పని చేస్తాయని శ్వేతా త్రిపాఠి మనసులోని మాటను పంచుకున్నారు. భవిష్యత్తులో కూడా వైవిధ్యమైన సవాలుతో కూడిన పాత్రలు చేస్తూ నటిగా మరింత ముందుకు సాగడమే లక్ష్యమని శ్వేత ముగించారు.