మిరాయ్ తో క్లాష్.. కిష్కింధపురి ప్లాన్ వర్కౌట్ అవుతుందా
టాలీవుడ్ లో భారీ అంచనాలతో రిలీజ్ కు సిద్ధమైన రెండు సినిమాలు మిరాయ్, కిష్కింధపురి. ఈ రెండు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో రేపే బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి.
By: M Prashanth | 11 Sept 2025 11:07 PM ISTటాలీవుడ్ లో భారీ అంచనాలతో రిలీజ్ కు సిద్ధమైన రెండు సినిమాలు మిరాయ్, కిష్కింధపురి. ఈ రెండు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో రేపే బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. తేజ సజ్జా మిరాయ్ లో నటించగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి సినిమాలో నటించారు. రెండు చిత్రాలలోనూ మిరాయ్ కు సినిమా వర్గాల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే కిష్కింధపురి చిత్ర బృందం సినిమా విడుదలకు ముందే పెయిడ్ ప్రీమియర్లతో బెనిఫిట్ పొందాలని కోరుకుంటోంది.
కిష్కింధపురి మేకర్స్ ఈ సాయంత్రం హైదరాబాద్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఇతర ప్రధాన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్లను నిర్వహిస్తోంది. సింగిల్ స్క్రీన్లు , మల్టీప్లెక్స్‌లలో చాలా షోలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో ప్రత్యేక ఆసక్తిని కలిగించింది. అంతేకాకుండా, ఈ సినిమా హర్రర్ ఎంటర్‌టైనర్ కావడంతో ప్రేక్షకులను కూడా టెంప్ట్ చేస్తోంది.
తెలుగులో హర్రర్ జానర్‌కు ఎల్లప్పుడూ ప్రేక్షకాదణ ఉంటుంది. అయితే ఈ ప్రీమియర్ లకు పాజిటివ్ టాక్ వస్తే, రేపు సినీ ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ ఇదే అవుతుంది. ఇది మిరాయ్ తో పోటీకి బెనిఫిట్ ఉంటుంది. సినిమాకు పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది.
ఇటీవలే లిటిల్ హార్ట్స్ నిర్మాతలు కూడా సినిమా విడుదలకు ముందే పెయిడ్ ప్రీమియర్లు నిర్వహించారు. ఈ వ్యూహం వారికి బాగా పనిచేసింది. అయితే, బెల్లంకొండ రీసెంట్ చిత్రం భైరవం బాక్సాఫీస్ వద్ద బాగా ఆడకపోవడంతో, ప్రేక్షకులు పెయిడ్ ప్రీమియర్లకు రావడానికి ఆసక్తి చూపుతారో లేదో తెలియదు.
ఏది ఏమైనా సినిమా క్లిక్ అయితే, అది బెల్లంకొండ- అనుపమ తోపాటు చిత్ర దర్శకుడు కౌశిక్ లకు కెరీర్ లో బూస్ట్ ఇస్తుంది. అదే పెయిడ్ ప్రీమియర్లకు మిశ్రమ స్పందన వస్తే, రేపు అది ఖచ్చితంగా మిరాయ్ కి ప్రయోజనం చేకూరుస్తుంది. బాక్సీఫీస్ పోటీ కూడా వాళ్లకే అనుకూలంగా ఉంటుంది. మరి బాక్సాఫీస్ విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోతుందిలే.
