Begin typing your search above and press return to search.

తేజ VS బెల్లంకొండ... అడ్వాన్స్‌లో ఉన్నది ఎవరు?

యంగ్‌ హీరో తేజ సజ్జా హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన 'మిరాయ్‌' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Ramesh Palla   |   10 Sept 2025 11:42 AM IST
తేజ VS బెల్లంకొండ... అడ్వాన్స్‌లో ఉన్నది ఎవరు?
X

యంగ్‌ హీరో తేజ సజ్జా హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన 'మిరాయ్‌' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు అయ్యాయి. తెలుగు రాష్ట్రల్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. ఈనెల 12న విడుదల కాబోతున్న అన్ని సినిమాలతో పోల్చితే ఖచ్చితంగా మిరాయ్‌ సినిమా అత్యధిక స్క్రీన్స్‌లో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున విడుదల చేయడం కోసం హీరో తేజ సజ్జా రెండు వారాలుగా దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇది పక్కా పాన్‌ ఇండియా కంటెంట్‌ మూవీ అంటూ ఇప్పటికే విడుదల అయిన టీజర్‌, ట్రైలర్‌ను చూస్తూ ఉంటే అనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కిష్కింధాపురి సినిమాపై భారీ అంచనాలు..

విడుదల రెండు రోజులు ఉండగా అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు పెట్టారు. మొదటి రోజు కాస్త స్లోగా బుకింగ్‌ ప్రారంభం అయింది. నేటి నుంచి బుకింగ్‌ జోరు అందుకునే అవకాశాలు ఉన్నాయి. మిరాయ్ విడుదల కాబోతున్న రోజే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపొందిన 'కిష్కింధాపురి' సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. విభిన్నమైన థ్రిల్లర్‌ హర్రర్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు బెల్లంకొండ ప్రమోషన్స్‌లో ఊదరగొట్టేస్తున్నాడు. ప్రమోషన్స్‌ ను సైతం చాలా విభిన్నంగా చేయడం వల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ట్రైలర్‌ విడుదల కార్యక్రమంను సైతం చాలా విభిన్నంగా రూపొందించడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించారు. కొత్త దర్శకుడు ఈ సినిమాను చాలా ఫ్రెష్‌ సబ్జెక్ట్‌తో రూపొందించాడు అంటూ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బలంగా చెబుతున్నాడు.

తేజ సజ్జా 'మిరాయ్‌' సినిమా అడ్వాన్స్ బుకింగ్‌

మిరాయ్ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయబోతుండగా, బెల్లంకొండ వారి కిష్కింధపురి సినిమా మాత్రం కేవలం తెలుగులో మాత్రమే విడుదల కాబోతుంది. రెండు సినిమాలకు ఒకే రోజు అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయింది. రెండు సినిమాలకు విడుదలకు ముందు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యే విధంగా ప్రమోషన్స్ చేశారు. అయితే అడ్వాన్స్ బుకింగ్‌ విషయంలో మొదటి రోజు హడావిడి లేకపోవడంతో మేకర్స్ ఒకింత ఆందోళనకు గురి అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో క్రేజ్ ఉన్న సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్‌ భారీ ఎత్తున జరుగుతున్న విషయం తెల్సిందే. కాన ఈ సినిమాల యొక్క అడ్వాన్స్‌ బుకింగ్‌ ఒక మోస్తరుగానే ఉన్నాయి. కనుక ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయా అనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తం అవుతోంది. విడుదలకు మరో రెండు రోజుల సమయం ఉన్న కారణంగా ఈ గ్యాప్‌లో భారీగా బుకింగ్స్ జరుగుతాయేమో చూడాలి.

మిరాయ్‌ వర్సెస్‌ కిష్కింధాపురి

మిరాయ్‌ సినిమా బడ్జెట్‌, స్పాన్‌ ఇతర విషయాలను బట్టి చూస్తే భారీ ఓపెనింగ్స్ నమోదు కావాల్సిన అవసరం ఉంది. మిరాయ్ సినిమా బడ్జెట్‌ ఎక్కువ అనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. ఇప్పటికే సినిమా నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా భారీ మొత్తంను రాబట్టింది. థియేట్రికల్‌ రిలీజ్ ద్వారా రాబట్టాల్సింది కొంత మొత్తమే అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. కనుక మినిమం ఓపెనింగ్‌ కలెక్షన్స్ వస్తే ఖచ్చితంగా తేజ ఓ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం గత చిత్రం భైరవం ఆశించిన స్థాయిలో కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకోక పోవడంతో ఈ సినిమా విషయంలో చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఈ ఇద్దరు హీరోల సినిమాల్లో ఏది ముందు నిలుస్తుంది, అడ్వాన్స్ బుకింగ్‌లో ఏది పై చేయి సాధిస్తుంది అనేది విడుదల ముందు వరకు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు సినిమాలు కూడా ఇద్దరు హీరోలకు వారి వారి కెరీర్‌ పరంగా చాలా కీలకంగా ఉన్నాయి. రెండు సినిమాలు వేరు వేరు జోనర్‌ సినిమాలు కనుక వసూళ్ల విషయంలో ఒక సినిమా పై మరో సినిమా ప్రభావం ఎక్కువ ఉండకపోవచ్చు అనేది కొందరి మాట.