Begin typing your search above and press return to search.

మిరాయ్ వర్సెస్ కిష్కిందపురి.. మీ ఫస్ట్ ఛాయిస్ ఏది..?

కిష్కింద పురి సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ ఇదివరకు రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్నారు.

By:  Ramesh Boddu   |   9 Sept 2025 12:03 PM IST
మిరాయ్ వర్సెస్ కిష్కిందపురి.. మీ ఫస్ట్ ఛాయిస్ ఏది..?
X

ఈ వీకెండ్ కి రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న కిష్కింద పురి ఒకటి కాగా ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో వస్తున్న మిరాయ్ ఒకటి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న కిష్కింద పూరి సినిమాను కౌశిక్ పెగల్లపాటి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

రాక్షసుడు సినిమాతో హిట్..

కిష్కింద పురి సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ ఇదివరకు రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి చేసిన సినిమా ఇదే. అంతేకాదు బెల్లంకొండ హీరో ఇలాంటి థ్రిల్లర్ జోనర్ ట్రై చేసిన టైం లోనే హిట్ అందుకున్నాడు. అలా సినిమా మీద స్పెషల్ బజ్ ఉంది. ఐతే కిష్కిందపురి సినిమా చాలా తక్కువ రన్ టైం తో వస్తుంది. ఈమధ్య సినిమాలన్నీ కూడా 3 గంటలకు దగ్గరలో రన్ టైం తో వస్తున్నాయి.

కిష్కిందపురి మాత్రం కేవలం 2 గంటల 5 నిమిషాల రన్ టైం తో వస్తుంది. ఈమధ్య కలాంలో ఇంత తక్కువ రన్ టైం వచ్చిన సినిమా లేదు. ఇక మరోపక్క పోటీగా వస్తున్న తేజా సజ్జ మిరాయ్ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు. మిరాయ్ సినిమా లో మంచు మనోజ్ కూడా ఉన్నాడు. తేజ, మనోజ్ ఇద్దరు కూడా సినిమాకు తమ బెస్ట్ ఇచ్చినట్టు ఉన్నారు. మిరాయ్ సినిమా ట్రైలర్ తోనే సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేసుకున్నారు.

సినిమా రన్ టైం 2 గంటల 49 నిమిషాల..

సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రన్ టైం 2 గంటల 49 నిమిషాల దాకా ఉందట. అంటే 169 నిమిషాల రన్ టైం తో వస్తుంది మిరాయ్. ఆడియన్స్ లో రెండు సినిమాలకు మంచి బజ్ ఉంది. కిష్కిందపురి, మిరాయ్ రెండు వేరు వేరు జోనర్ సినిమాలు. సో రెండు ఒకేరోజు వచ్చినా కూడా సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా రెండు సినిమాలు సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంటుంది.

మిరాయ్ వర్సెస్ కిష్కింద పూరి సినిమాల మధ్య ఈ ఫైట్ ఆడియన్స్ లో కూడా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. హనుమాన్ సక్సెస్ తర్వాత తేజా సజ్జ చేసిన సినిమా కిష్కిందపురి కాగా.. భైరవం తో నిరాశపరచిన బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన కిష్కిందపురి సినిమా తో మెప్పించాలని చూస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాల్లో ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకునే సినిమా ఏది అవుతుందో మరో 3 రోజుల్లో తెలుస్తుంది.