ఫలించిన ప్రేక్షకుల డిమాండ్.. మిరాయ్ లో వైబ్ సాంగ్.. మేకర్స్ ప్రకటన!
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన మూవీ మిరాయ్.
By: Madhu Reddy | 23 Sept 2025 2:40 PM ISTకార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన మూవీ మిరాయ్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5న విడుదలై ఎంత మంచి రెస్పాన్స్ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా చూసిన చాలామంది ప్రేక్షకులు పూనకం వచ్చినట్లు సినిమా బ్లాక్ బస్టర్.. ఎక్స్ట్రాడినరీ..అంటూ ఫస్ట్ షో తోనే రివ్యూలు ఇచ్చేశారు. అంతేకాదు ఒక యంగ్ హీరో,యంగ్ డైరెక్టర్ ఇంత గొప్ప సినిమా చేయడం నిజంగా అద్భుతమే అని రివ్యూ కూడా ఇచ్చారు. అలాగే ఇందులో విలన్ గా నటించిన మంచు మనోజ్ యాక్టింగ్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి.అలా మిరాయ్ మూవీని ఎంతోమంది ఆదరించారు.
అయితే మిరాయ్ మూవీ చూసి అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ ఒక విషయంలో మాత్రం చాలా బాధతో థియేటర్ల నుండి బయటకు వచ్చారు.ఆ ఒక్కటి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మరి ఇంతకీ ఆ ఒక్కటి ఏంటంటే .. "వైబ్ ఉందిలే" సాంగ్.. మిరాయ్ సినిమా విడుదలకు ముందే వైబ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట మిరాయ్ మూవీకి పెద్ద ప్లస్ అయింది. ఎక్కడ చూసినా కూడా వైబ్ ఉందిలే పిల్లా అనే పాటనే మారుమ్రోగిపోయింది. అలా విడుదలకు ముందే అందరి నోళ్లలో నానిన వైబ్ ఉందిలే పిల్లా అనే పాట ఫుల్ వీడియోని థియేటర్లలో చూడొచ్చని ఫ్యాన్స్ ఎంతగానో ఎగ్జైట్ అయ్యారు. కానీ తీరా థియేటర్లకు వెళ్లి చూసిన అభిమానులకి నిరాశే కలిగింది. ఎందుకంటే ఈ సినిమా నిడివి ఎక్కువ ఉండడం వల్ల ఇందులో నుండి వైబ్ ఉందిలే పిల్లా పాటను చిత్ర యూనిట్ తొలగించేసింది.
దాంతో సినిమా చూసిన ప్రేక్షకులు అంతా బాగానే ఉంది కానీ వైబ్ ఉందిలే పిల్లా పాట ఉంటే మరింత బాగుండు అంటూ కామెంట్ చేశారు. అయితే ఇది ఒకరిద్దరు చెప్పిన మాటలు అయితే కాదు. ప్రపంచవ్యాప్తంగా సినిమా చూసిన వాళ్ళందరూ వైబ్ ఉందిలే పిల్లా పాట సినిమాలో యాడ్ చేస్తే బాగుండు అని కోరుకున్నారు. దీంతో ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఈ సినిమాలో తాజాగా వైబ్ ఉందిలే పిల్లా అనే సాంగ్ ని యాడ్ చేశారు చిత్ర యూనిట్. తాజాగా దీనికి సంబంధించి విషయాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది.
"మీరు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైబ్ వచ్చేసింది.చాట్ బస్టర్ వైబ్ ఉంది పాట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది.. బిగ్ స్క్రీన్ పై మిరాయ్ మూవీని చూస్తున్న వాళ్ళందరూ ఈ వైబ్ ఉంది పాటని ఎంజాయ్ చేయండి".. అన్నట్లుగా మేకర్స్ పోస్ట్ పెట్టారు. అలా మిరాయ్ మూవీలో వైబ్ ఉందిలే పిల్లా అనే పాట ఈరోజు నుండి థియేటర్లలో యాడ్ చేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. అంతేకాదు ఇప్పటికే మిరాయ్ సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు మళ్లీ వైబ్ ఉందిలే పిల్లా పాట చూడడం కోసమైనా టికెట్లు బుక్ చేసుకొని.. ఈ పాట ను థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ పొందడం కోసం మళ్ళీ థియేటర్లకు క్యూలు కడుతున్నారు.
