Begin typing your search above and press return to search.

మిరాయ్ ఇలా ఉంటే రాజా సాబ్ మెంటల్ ఎక్కిస్తారా..?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ సినిమాలు చేస్తూ దాదాపు ఐదారేళ్ల నుంచి ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నారు.

By:  Ramesh Boddu   |   13 Sept 2025 4:00 PM IST
మిరాయ్ ఇలా ఉంటే రాజా సాబ్ మెంటల్ ఎక్కిస్తారా..?
X

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ సినిమాలు చేస్తూ దాదాపు ఐదారేళ్ల నుంచి ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నారు. భారీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు కానీ వాటికి సరైన సక్సెస్ లు పడట్లేదు. ఐతే మిరాయ్ సినిమాతో వాళ్ల సంస్థలో మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తేజ సజ్జ లీడ్ రోల్ లో కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన మిరాయ్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. తేజ సజ్జ తో పాటు ఈ సినిమాలో మంచు మనోజ్ యాక్టింగ్ గురించి కూడా బాగా చెప్పుకుంటున్నారు.

మిరాయ్ సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్..

మనోజ్ కంబ్యాక్ ఇలా ఉంటుందని ఎవరు ఊహించలేదు. తనకు ఒక బలమైన పాత్ర పడితే ఎలా చేస్తాడో చూపించాడు మనోజ్. ఐతే మిరాయ్ సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. హాలీవుడ్ లెవెల్ గ్రాఫిక్స్ ని చేశారని ప్రశంసిస్తున్నారు. అంతేకాదు 60 కోట్ల బడ్జెట్ లో ఈ రేంజ్ అవుట్ పుట్ సూపర్ అనేస్తున్నారు. మామూలుగా ఒక సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చూసి సినిమా హిట్టా ఫట్టా అని చెప్పేస్తున్న రోజులు ఇవి.

సినిమా కథ బాగున్నా సరే సీజీ వర్క్ సరిగా లేక పెదవి విరిచేస్తున్నారు ఆడియన్స్. ఐతే మిరాయ్ సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చూసి సర్ ప్రైజ్ అవుతున్నారు. హాలీవుడ్ నుంచి కాదు ఇదంతా హైదరాబాద్ పీపుల్ మీడియా ఆఫీస్ లోనే మన దగ్గర ఉన్న డిజైనర్స్ తోనే ఇది చేశారు. మిరాయ్ చూశాక అదే బ్యానర్ నుంచి వస్తున్న రాజా సాబ్ మీద మరింత హైప్ పెరిగింది.

రాజా సాబ్ టీజర్ తో సినిమా శాంపిల్..

ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న లో కూడా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చాలా ప్రాధాన్యత ఉండబోతుంది. ఆల్రెడీ టీజర్ తోనే సినిమా ఏంటో శాంపిల్ గా చూపించారు. మిరాయ్ చూశాక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సీజీ వర్క్ విషయంలో సూపర్ అనేలా ఉన్నారు. రాజా సాబ్ కి కూడా ఈ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఈ రేంజ్ లో క్ల్లిక్ అయితే మాత్రం సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.

మిరాయ్ సినిమా కథకు వాళ్లు వాడిన సీజీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కి పర్ఫెక్ట్ సింక్ అయ్యింది. ఇప్పుడు ఇదే బ్యానర్ నుంచి రాజా సాబ్ వస్తుంది. ఆ సినిమాలో కూడా సీజీ వర్క్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. సో మిరాయ్ కే ఇలా ఉంటే రాజా సాబ్ కి మెంటల్ ఎక్కించేయడం పక్కా అని రెబల్ ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. మొత్తానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇన్నాళ్లకు మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు.