Begin typing your search above and press return to search.

మిరాయ్@10 రోజులు.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

పది రోజులకు గాను మిరాయ్ మూవీ.. రూ.134.40 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ సోమవారం అనౌన్స్ చేశారు.

By:  M Prashanth   |   22 Sept 2025 6:27 PM IST
మిరాయ్@10 రోజులు.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
X

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన మిరాయ్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సైంటిఫిక్ యాక్షన్ జోనర్ లో రూపొందిన ఆ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.

సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధగా నటించగా.. యంగ్ బ్యూటీ రితికా హీరోయిన్ గా సందడి చేశారు. మంచు మనోజ్ విలన్ గా నటించగా.. సీనియర్ నటులు శ్రియా శరణ్, జగపతి బాబు, జయరాం కీలక పాత్రలు పోషించారు. వెంకటేష్ మహా, గెటప్ శ్రీను ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేయగా.. గౌర హరి మ్యూజిక్ అందించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరించారు.

భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అయిన మిరాయ్.. వాటిని అందుకుని తొలి రోజు నుంచే దూసుకుపోతోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇప్పటికే స్కూల్స్ కూడా సెలవులు ఇవ్వడంతో ఇంకా థియేటర్స్ అన్నీ కళకళలాడుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి.

పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన మిరాయ్.. ఇప్పటికే ఫస్ట్ వీక్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు రెండో వారంలో కూడా మంచి వసూళ్లను సాధిస్తోంది. అదే సమయంలో ఆదివారంతో 10 రోజులు పూర్తి కాగా, మేకర్స్ కలెక్షన్స్ ను ప్రకటించారు.

పది రోజులకు గాను మిరాయ్ మూవీ.. రూ.134.40 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ సోమవారం అనౌన్స్ చేశారు. సూపర్ యోధ బ్రహ్మాండ ఆధిపత్యం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోందని తెలిపారు. బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ మిరాయ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 134.40 కోట్ల+ గ్రాస్‌ వసూళ్లతో 10 బ్లాక్‌ బస్టర్ రోజులను పూర్తి చేసుకుందని చెప్పారు.

అదే సమయంలో స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో సంపతిని తేజ సజ్జా ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నట్లు కనిపించారు. ప్రస్తుతం పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సూపర్ గా ఉందని అంటున్నారు. ఏదేమైనా మిరాయ్ మూవీ.. కంప్లీట్ రన్ లో ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో వేచి చూడాలి.