మనోజ్ చాలా అగ్రెస్సివ్ గా ఉంటాడు
యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Sravani Lakshmi Srungarapu | 30 Aug 2025 2:51 PM ISTయంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న మిరాయ్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా ఇందులో రితికా నాయర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
స్పెషల్ ఎట్రాక్షన్ గా మనోజ్, శ్రియా
మిరాయ్ లో మంచు మనోజ్, శ్రియా శరణ్, జయరామ్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో తేజ సజ్జ, మంచు మనోజ్ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ సినిమాపై హైప్ ను పెంచుతూ మిరాయ్ కు మంచి బజ్ ను తీసుకొస్తున్నారు.
సాధారణంగా మనోజ్ తన చాలా సినిమాల్లో అగ్రెస్సివ్ గా కనిపిస్తారని, కానీ మిరాయ్ లో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మనోజ్ ను చాలా స్టైలిష్ గా కొత్త లుక్ లో ప్రెజెంట్ చేశారని, మనోజ్ నటించే విధానం, అతని డైలాగ్ డెలివరీ చాలా షార్ప్ గా ఉంటూనే కంట్రోల్డ్ గా ఉంటాయని, మనోజ్ నుంచి డైలాగ్ డెలివరీ నేర్చుకోవచ్చని మనోజ్ ను ఉద్దేశించి తేజ సజ్జ అనగా ఆ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారీ బడ్జెట్ తో..
ఇక మిరాయ్ విషయానికొస్తే మేకర్స్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా బడ్జెట్ ను మించి ఖర్చు పెట్టారు. ఈ సినిమాను కార్తీక్ టెక్నికల్ గా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తీయడానికి కష్టపడ్డారనే విషయం ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
