Begin typing your search above and press return to search.

మిరాయ్‌ : తేజ తర్వాతే అందరూ..!

హనుమాన్ సినిమాతో పెద్ద హీరోల సరసన నిలిచిన తేజ సజ్జా 'మిరాయ్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

By:  Ramesh Palla   |   10 Sept 2025 10:32 AM IST
మిరాయ్‌ : తేజ తర్వాతే అందరూ..!
X

హనుమాన్ సినిమాతో పెద్ద హీరోల సరసన నిలిచిన తేజ సజ్జా 'మిరాయ్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. హనుమాన్‌ సినిమాకు ముందు ఈ సినిమాకు బీజం పడింది. హనుమాన్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమాను కష్టపడి రూపొందించారు. ఏడాదిన్నర మేకింగ్‌ చేసుకున్న మిరాయ్ సినిమాను ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్‌ కీలక పాత్రలో నటించిన నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాతో తేజ మరో కమర్షియల్‌ బిగ్‌ హిట్‌ ను సొంతం చేసుకుంటాడు అనే నమ్మకంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. హీరో తేజ సినిమా ప్రమోషన్‌లో చేస్తున్న వ్యాక్యలు సైతం అదే నమ్మకంను కలిగిస్తున్నాయి. అందుకే తేజ ప్రమోషన్‌ లో అంతా తానై చూసుకుంటున్నాడు.

తేజ హీరోగా మంచు మనోజ్‌ విలన్‌గా...

హీరోగా తేజ నటించగా విలన్‌గా మంచు మనోజ్‌ నటించాడు. కనుక తేజ, మంచు మనోజ్‌ లు కలిసి ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఈవెంట్స్ లో తప్ప ఇంటర్వ్యూలు, ప్రత్యేక మీడియా సమావేశాల్లో తేజ, మంచు మనోజ్ కలిసి కనిపించలేదు. మనోజ్ తనవంతుగా సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తేజ స్థాయిలో మాత్రం యాక్టివ్‌గా లేడు అని చెప్పక తప్పదు. తేజ గత రెండు వారాలుగా క్షణం తీరిక లేకుండా ప్రమోషన్‌లో ఉన్నాడు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అన్ని మీడియా సంస్థలకు, యూట్యూబ్‌ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా సినిమాను సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువగా ప్రమోట్‌ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి అనడంలో సందేహం లేదు.

మిరాయ్‌ ప్రమోషన్స్‌లో తేజ మాత్రమే

మంచు మనోజ్‌ గత చిత్ర ఫలితం, గత పదేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉండటం వంటి కారణాల వల్ల సినిమా ప్రమోషన్‌లో ఆయన్ను కాస్త సైడ్‌ చేస్తేనే బాగుంటుంది అనేది సినీ విశ్లేషకుల మాట. కానీ మేకర్స్ మాత్రం ఆయనతో ప్రమోషన్ చేయిస్తున్నారు. కానీ తేజ మాత్రమే ఫేస్ అన్నట్లుగా మిరాయ్‌ ప్రమోషన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. మంచు మనోజ్‌ ఈ సినిమాతో ఖచ్చితంగా ఒక మంచి బ్రేక్‌ను దక్కించుకుంటాడు అంటూ ఆయన సన్నిహితులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత పవర్‌ ఫుల్‌ విలన్‌గా మంచు మనోజ్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అంతే పవర్ ఉండే సూపర్ హీరో పాత్రలో తేజ సజ్జా కనిపించబోతున్నాడు. వీరిద్దరి కాంబో మూవీ కోసం మొదటి నుంచి ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా మంచి వినోదం దక్కడం ఖాయం.

హనుమాన్‌ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న తేజ

హనుమాన్‌ సినిమా తర్వాత ఎన్నో కథలు వచ్చినా, పెద్ద దర్శకులు, ప్రముఖ నిర్మాతలు సంప్రదించేందుకు చూసినా సున్నితంగా వాటన్నింటిని తిరస్కరిస్తూ వచ్చిన తేజ మిరాయ్ సినిమా కోసమే పూర్తి సమయంను కేటాయించాడు. మియార్‌ సినిమాకు కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు గౌర హరి సంగీతాన్ని అందించాడు. ఈయన సంగీతం అందించిన వైబ్‌ ఉంది బేబీ పాట సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమాతో తేజకు జోడీగా క్యూట్‌ బ్యూటీ రితికా నాయక్‌ నటించింది. ఈమె ఫ్రెష్‌ గా కనిపిస్తుందని, తేజకు సరి జోడీ అన్నట్లుగా ఇప్పటికే టాక్‌ ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే కథ, కథనంతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఈ సినిమా నిర్మాణం జరిగింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.