మిరాయ్ సంపతి.. బ్యాక్ స్టోరీ తెలుసా..?
కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తేజ సజ్జ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా మిరాయ్.
By: Ramesh Boddu | 15 Sept 2025 10:16 AM ISTకార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తేజ సజ్జ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా మిరాయ్. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వాళ్ల నమ్మకం నిమమైంది. ఐతే మిరాయ్ సినిమాలో సంపతి రోల్ కూడా ప్రాధాన్యత కలిగి ఉంది. ఆ పక్షి పాత్రని డిజైన్ చేసిన విధానం అదిరిపోయింది.
మిరాయ్ లో చాలా మంచి సీజీ వర్క్..
మిరాయ్ సినిమా కథ, కథనాలతో పాటు గ్రాఫిక్స్ కూడా అబ్బురపరచాయి. ఈమధ్య కాలంలో ఒక సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ బాగా లేకపోతే అది ఆ సినిమా రిజల్ట్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాంటి టైం లో లిమిటెడ్ బడ్జెట్ తో తీసిన మిరాయ్ లో చాలా మంచి సీజీ వర్క్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. అంతేకాదు మిరాయ్ లో సంపతి డిజైన్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. ఐతే సంపతి వెనక ఉన్న సీక్రెట్ రివీల్ చేశాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని.
మిరాయ్ లో సంపతి కేవలం సీజీతోనే కాదు యానిమాట్రానిక్స్ వాడి రెడీ చేశామని అన్నాడు. ఇండియాలోనే యానినాట్రానిక్స్ తెలిసిన ఒకే ఒక మనిషి ఉన్నాడు. అతన్ని ముంబై నుంచి తెప్పించి సంపతి పాత్ర సృష్టించామని. యానిమాట్రానిక్స్ వల్ల రిమోట్ తో వాటిని మనం కంట్రోల్ చేయొచ్చని అన్నారు కార్తీక్. అలా మిరాయ్ సినిమాలో సంపతిని డిజైన్ చేశామని ఐతే సినిమా చూసిన ఆడియన్స్ మాత్రం చాలా ఎగ్జైట్ అవుతున్నారని అన్నారు.
డిజప్పాయింట్ చేసిన కార్తీక్..
రవితేజతో ఈగల్ సినిమా చేసి డిజప్పాయింట్ చేసిన కార్తీక్ తో మళ్లీ అదే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు మిరాయ్ అనౌన్స్ చేసినప్పుడే ఈ డైరెక్టర్ టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు కార్తీక్. మిరాయ్ సినిమాలో తేజ సజ్జ, మంచు మనోజ్, రితిక, శ్రీయ ఇలా అందరు కూడా తమ బెస్ట్ ఇచ్చారు. అందుకే సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది.
తెర మీద కొత్త కథలు చూపించాలనుకునే క్రమంలో యువ దర్శకులు కొత్త టెక్నాలజీ వాడుతూ అద్భుతాలు చేస్తున్నారు. మిరాయ్ సినిమాలో సంపతిని చూస్తే అది పూర్తిగా గ్రాఫిక్స్ అనుకున్నారు. కానీ ముంబై నుంచి యానిమాట్రానిక్స్ తెలిసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మరీ ఒక రిమోట్ కంట్రోల్ పక్షిని తయారు చేసి దానికి సీజీ యాడ్ చేసి సంపతిని సృష్టించారు. ఈ విషయం తెలిసిన ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. తేజ సజ్జ ఖాతాలో మిరాయ్ మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్నాడు యువ హీరో తేజ సజ్జ.
