చిరు విలన్ గా మంచు హీరో..?
ఈ మధ్యనే భైరవం సినిమాతో రీ ఎంట్రీ షురూ చేసిన మనోజ్ రీసెంట్ రిలీజ్ మిరాయ్ తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు.
By: Ramesh Boddu | 19 Sept 2025 9:52 AM ISTమంచు ఫ్యామిలీ హీరో మంచు మనోజ్ ఫైనల్ గా సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మధ్యనే భైరవం సినిమాతో రీ ఎంట్రీ షురూ చేసిన మనోజ్ రీసెంట్ రిలీజ్ మిరాయ్ తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. తేజ సజ్జ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో మహావీర్ లామా బ్లాక్ స్వార్డ్ గా మనోజ్ అదరగొట్టాడు. ఏదైతే కొన్నాళ్లుగా మంచు మనోజ్ వెతుకుతున్న సాలిడ్ రోల్ ఈ సినిమాతో దక్కింది.
మనోజ్ చేసిన నెగిటివ్ రోల్..
తండ్రి బాటలోనే హీరోగానే కాదు విలన్ గా కూడా ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు మంచు మనోజ్. 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ టైం లో మనోజ్ చేసిన నెగిటివ్ రోల్ ని కూడా ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మంచు మనోజ్ ఫ్యాన్స్ ఐతే తిరిగి మనోజ్ సినిమాలు చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నారు. ఐతే ఇదే టైం లో ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచు మనోజ్ విలన్ గా కొనసాగేందుకు ఆసక్తిగా ఉన్నారట.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా మనోజ్ విలన్ గా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. బాబీ కొల్లి డైరెక్షన్ లో చిరు సినిమా రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఆ సినిమాను మాస్ యాక్షన్ మూవీగా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు కెమెరా మెన్ గా మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని చేస్తున్నాడు. ఐతే ఈ సినిమాలో విలన్ రోల్ కూడా చాలా బలంగా రాసుకున్నాడట బాబీ. అందుకే మంచు మనోజ్ ని తీసుకుంటే బెటర్ అని భావిస్తున్నారట.
చిరంజీవికి విలన్ గా కలెక్షన్ కింగ్..
ఎలాగు మిరాయ్ తో కలిసి పనిచేశారు కాబట్టి కార్తీక్ కూడా మనోజ్ కి ఓకే చెప్పి ఉండొచ్చు. ఐతే ఇక్కడ అసలు విషయం ఏంటంటే చిరంజీవికి విలన్ గా ఆల్రెడీ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేశారు. మళ్లీ ఆయనకు విలన్ గా ఆయన తనయుడు మంచు మనోజ్ చేయడమే. ఈ న్యూస్ నిజమైతే మాత్రం మెగా విలన్ గా మంచు హీరో స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.
చిరంజీవితో బాబీ ఆల్రెడీ వాల్తేరు వీరయ్య సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ మరో సినిమా సెట్ చేశారు. ఈసారి ఫుల్ లెంగ్త్ మాస్ మూవీ వింటేజ్ మెగాస్టార్ ని చూపించేలా కథ రాసుకున్నాడట బాబీ. మెగాస్టార్ చిరంజీవికి విలన్ గా కూడా మంచు మనోజ్ చేస్తే మాత్రం కెరీర్ మరింత స్పీడ్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఎలాగు యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి మంచు మనోజ్ కి అవకాశాలు వాటంతట అవే వస్తాయి.
