Begin typing your search above and press return to search.

ఆదాయం కన్నా గౌరవమే ముఖ్యం.. OG కోసం మిరాయ్ టీమ్ కీలక నిర్ణయం

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిరాయ్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

By:  M Prashanth   |   24 Sept 2025 11:05 AM IST
ఆదాయం కన్నా గౌరవమే ముఖ్యం.. OG కోసం మిరాయ్ టీమ్ కీలక నిర్ణయం
X

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిరాయ్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జా, క్రేజీ హీరోయిన్ రితికా నాయక్ లీడ్ రోల్స్ లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఆ సినిమాను టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మించారు.

సెప్టెంబర్ 12వ తేదీన విడుదలైన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. మరికొద్ది రోజుల్లో సెకండ్ వీక్ ను కంప్లీట్ చేసుకునేందుకు సిద్ధమవుతుండగా.. ఇప్పటి వరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు కూడా స్టార్ట్ అవ్వడంతో థియేటర్స్ అన్నీ కళకళలాడుతున్నాయి.

బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పుడు మిరాయ్ మూవీ టీమ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరి ప్రశంసలు కూడా అందుకుంటోంది. సెప్టెంబర్ 25వ తేదీన అంటే గురువారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ (They Call Him OG) మూవీ విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా.. అందరూ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు మిరాయ్ మేకర్స్.. ఓజీ మూవీ పెద్ద ఎత్తున రిలీజ్ అయ్యేందుకు చొరవ తీసుకున్నారు. గురువారం నాడు మిరాయ్ షోలు అన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. మళ్లీ శుక్రవారమే మిరాయ్ మూవీని ప్రదర్శించనున్నారు.

దీంతో ఇప్పుడు ఆ నిర్ణయం అందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్‌ తో టీజీ విశ్వప్రసాద్ తన బంధాన్ని ఎంతగా విలువైనదిగా భావిస్తారో స్పష్టంగా చూపిస్తోంది. ఒక రోజు ఆదాయం కంటే గౌరవం, బంధమే ఎక్కువని విశ్వప్రసాద్ నిరూపించారు. సంబంధాలు ఎప్పటికీ ముఖ్యమని ఆయన చెప్పకనే చెప్పారు.

అయితే నిర్మాత తీసుకున్న నిర్ణయాన్ని హీరో తేజ సజ్జా కూడా అంగీకరించడం గ్రేటే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత లీడ్ రోల్స్ లో మెప్పించి.. ఇప్పుడు హీరోగా సందడి చేస్తున్న తేజ్.. తన గౌరవాన్ని ఇప్పుడు ప్రదర్శించారు. మొత్తానికి రేపు అంతా మిరాయ్ మూవీ ఉన్న థియేటర్స్ లో కూడా ఓజీ సినిమానే సందడి చేయనుంది. అలా పెద్ద ఎత్తున విడుదలవ్వనుంది.