దాని వల్లే ఎక్కువ బడ్జెట్.. మిరాయ్ తో ఫుల్ క్లారిటీ!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన సినిమా మిరాయ్.
By: M Prashanth | 13 Sept 2025 8:00 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన సినిమా మిరాయ్. ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించగా.. మరో హీరో మంచు మనోజ్ విలన్ గా కనిపించారు. శ్రియా శరన్, జగపతిబాబు, జయరాం కీలక పాత్రల్లో నటించారు.
గౌర హరి మ్యూజిక్ అందించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ గ్రాండ్ గా నిర్మించారు. రీసెంట్ గా సినిమా రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది. విడుదలైన అన్ని సెంటర్స్ లో పాజిటివ్ టాక్ తో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద కూడా సాలిడ్ వసూళ్లను రాబడుతోంది.
అయితే సినిమా విజయంలో వీఎఫ్ ఎక్స్ కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. వర్క్ చాలా బాగా చేశారని నెటిజన్లు, సినీ ప్రియులు మేకర్స్ ను అభినందిస్తున్నారు. వీఎఫ్ ఎక్స్ వర్క్ అంతా అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ చెక్ చేసినా బ్లర్ లేకుండా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
నిజంగా టీమ్ అంతా అసాధారణమైన వర్క్ చేశారని అంటున్నారు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ తో ఎక్కువ అండ్ బెస్ట్ క్వాలిటీ వీఎఫ్ ఎక్స్ ను ఇచ్చారని చెబుతున్నారు. ఇది మామూలు విషయం కాదని కామెంట్లు పెడుతున్నారు. అయితే కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ తోనే మిరాయ్ మూవీ రూపొందించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అదే సమయంలో మిరాయ్ మూవీ చూశాక బడ్జెట్ విషయంలో మరో క్లారిటీ వస్తుందని కూడా నెటిజన్లు ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. సాధారణంగా వీఎఫ్ ఎక్స్ వర్క్ కీలకంగా ఉండే సినిమాల్లో దాని వల్ల బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు నిజం కాదని చెబుతున్నారు.
మిరాయ్ మూవీకి అయిన రూ.60 కోట్లు బడ్జెట్ ను ప్రస్తావిస్తున్నారు. అందులో డైరెక్టర్, హీరో సహా క్యాస్టింగ్ రెమ్యునరేషన్లు కూడా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాబట్టి సినిమాల బడ్జెట్ పెరుగుతుంది ఎప్పుడూ వీఎఫ్ ఎక్స్ వల్ల కాదని అంటున్నారు. స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోల పారితోషికం వల్లేనని అనిపిస్తున్నట్లు చెబుతున్నారు. మరి నిజమేంటో వారికే తెలియాలి.
