టాప్ ట్రెండింగ్ లో 'మిరాయ్'.. గంటలోనే 12వేలకు పైగా!
యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన మిరాయ్ మూవీ నేడు థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 12 Sept 2025 12:06 PM ISTయంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన మిరాయ్ మూవీ నేడు థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ జోనర్ లో రూపొందిన ఆ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించారు. మరో హీరో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషించగా.. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మిరాయ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నేడు వరల్డ్ వైడ్ గా సినిమాను రిలీజ్ చేశారు. 2డీ, 3డీ ఫార్మాట్స్ లో దాదాపు ఎనిమిది భాషల్లో మిరాయ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
సినిమాలో శ్రియా శరణ్, జగపతిబాబు, జయరామ్ కీలకపాత్రలు పోషించగా.. గౌర హరి మ్యూజిక్ అందించారు. అయితే సినిమాపై రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వినూత్న ప్రమోషన్స్ తో.. స్పెషల్ కంటెంట్ తో సూపర్ హైప్ క్రియేట్ చేశారు. కచ్చితంగా సినిమా చూడాలనేంతగా బజ్ సృష్టించారు.
ఇప్పుడు మూవీ మంచి రెస్పాన్స్ అందుకుని సందడి చేస్తోంది. సినిమా గొప్ప అనుభూతి కలిగిస్తుందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో కొన్నిరోజులుగా టాప్ ట్రెండింగ్ లోనే ఉంది మిరాయ్. ఇప్పుడు అదే కూడా ట్రెండ్స్ తో దూసుకుపోతోంది.
తాజాగా గంటలోనే 12.5 టికెట్స్ ను సినీ ప్రియులు బుక్ చేసుకున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండడంతో టికెట్స్ కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. దీంతో హాట్ కేకుల్లా టికెట్స్ సేల్ అవుతున్నాయి. సెకండ్ సాటర్డే సెలవు రోజు కావడంతో వరుసగా శని ఆదివారాల టికెట్స్ ను మూవీ లవర్స్ కొనుగోలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.
దీంతో అన్ని థియేటర్లలో మిరాయ్ మూవీకి భారీ ఆక్యుపెన్సీ ఉండనున్నట్లు అర్థమవుతోంది. నిజానికి.. మిరాయ్ మూవీ ముందు నుంచి బుక్ మై షో ట్రెండ్స్ లో దూసుకుపోతోంది. టికెట్స్ తెరవడం లేటు.. గంటకు సగటున 5 వేలకు పైగా సేల్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ అయిన రోజు గంటకు 12.5 టికెట్స్ అమ్ముడవడం గమనార్హం. అలా మిరాయ్ పై ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో క్లియర్ గా అర్థమవుతోంది.
