Begin typing your search above and press return to search.

మిరాయ్ అందుకే తగ్గించి అమ్మారా?

ఓ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలుండి, ట్రేడ్ వర్గాల్లో డిమాండ్ ఏర్పడితే.. ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముకోవడానికే చూస్తారు నిర్మాతలు.

By:  Garuda Media   |   30 Aug 2025 4:40 PM IST
మిరాయ్ అందుకే తగ్గించి అమ్మారా?
X

ఓ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలుండి, ట్రేడ్ వర్గాల్లో డిమాండ్ ఏర్పడితే.. ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముకోవడానికే చూస్తారు నిర్మాతలు. కానీ టాలీవుడ్ నెక్స్ట్ బిగ్ రిలీజ్ ‘మిరాయ్’ విషయంలో మాత్రం నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఉన్న మార్కెట్ వాల్యూ కంటే తక్కువ రేట్లకే సినిమాను అమ్ముతున్నారట. రెండు ‘మిరాయ్’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను రూ.25 కోట్ల రేంజిలో క్లోజ్ చేస్తున్నట్లు సమాచారం.

నైజాం రైట్స్ రూ.7 కోట్లకు ఇవ్వగా.. ఆంధ్ర, సీడెడ్ కలిపి రూ.11 కోట్లు పలికినట్లు సమాచారం. యుఎస్ సహా మిగతా ఏరియాలన్నీ కలిపి ఇంకో ఏడు కోట్ల దాకా బిజినెస్ జరిగింది. ఈ చిత్ర కథానాయకుడు తేజ సజ్జ చివరి చిత్రం ‘హనుమాన్’ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అన్ని సినిమాలూ అలా ఆడేస్తాయని కాదు కానీ.. ‘మిరాయ్’ మీద కూడా ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయగలదని భావిస్తున్నారు. ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాకు హైప్‌ను ఇంకా పెంచింది. ఈ నేపథ్యంలో ఎక్కువ రేట్లు పెట్టి సినిమాను అమ్ముకునే అవకాశముంది.

కానీ పీపుల్స్ మీడియా వాళ్ల చివరి చిత్రాలు బయ్యర్లను దెబ్బ కొట్టాయి. మిస్టర్ బచ్చన్, మనమే లాంటి చిత్రాలతో బయ్యర్లు దెబ్బ తిన్నారు. మరోవైపు ఈ సంస్థ నుంచి తర్వాత ‘రాజా సాబ్’ లాంటి భారీ చిత్రం రాబోతోంది. ఈ నేపథ్యంలో ‘మిరాయ్’ని ఓ మోస్తరు రేట్లకు అమ్మి బయ్యర్లకు గత చిత్రాల నష్టాలను భర్తీ చేయించడం.. అలాగే ఈ సినిమాను సక్సెస్ చేసి, ‘రాజా సాబ్’కు మంచి బిజినెస్ జరిగేలా చూసుకోవడం మేకర్స్ లక్ష్యంగా కనిపిస్తోంది. ‘మిరాయ్’కి రీచ్ పెంచడం కోసం ఇతర భాషల్లో పెద్ద పెద్ద బేనర్లతో అసోసియేట్ అయింది ‘పీపుల్స్ మీడియా’ సంస్థ. ఈ చిత్రానికి మంచి ఫలితం దక్కి, బయ్యర్లందరూ మంచి లాభాలు అందుకుంటే పీపుల్స్ మీడియా ప్రతిష్ట పెరిగి.. ‘రాజాసాబ్’కు అది అన్ని రకాలుగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.