Begin typing your search above and press return to search.

నిధి అగ‌ర్వాల్ సాంగ్ అందుకే పెట్ట‌లేదు

ఒక‌ప్పుడు క‌థ ఎలా ఉన్నా సాంగ్స్ చూడ్డానికైనా ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు వ‌చ్చేవారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   14 Sept 2025 12:46 PM IST
నిధి అగ‌ర్వాల్ సాంగ్ అందుకే పెట్ట‌లేదు
X

ఒక‌ప్పుడు క‌థ ఎలా ఉన్నా సాంగ్స్ చూడ్డానికైనా ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు వ‌చ్చేవారు. కానీ ఇప్పుడు సినిమా ర‌న్ టైమ్ ఎక్కువ అవుతుంద‌ని, పాటలు క‌థ‌ను డిస్ట్ర‌బ్ చేస్తున్నాయ‌ని హిట్ పాట‌ల‌ను సైతం ఎడిటింగ్ లో తీసేస్తున్నారు. సినిమాకు అస‌లు హైప్ తీసుకొచ్చిన సాంగ్స్‌నే మేక‌ర్స్ డిలీట్ చేయ‌డం ఆడియ‌న్స్ ను నిరుత్సాహ ప‌రుస్తున్న‌ప్ప‌టికీ, ఆ పాట‌లు మూవీలో ఉంచితే ఫ్లో దెబ్బ‌తింటుంద‌నేది మేక‌ర్స్ ఉద్దేశం.

బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా మిరాయ్

రీసెంట్ గా ప‌లు సినిమాల విష‌యంలో ఇదే జ‌రగ్గా ఇప్పుడు మిరాయ్ సినిమా విష‌యంలో కూడా అదే జ‌రిగింది. తేజ స‌జ్జ హీరోగా కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మిరాయ్ సినిమా రీసెంట్ గా రిలీజై ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుని బ్లాక్‌బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా చూసిన ఆడియ‌న్స్ అంద‌రూ పాట‌లు లేక‌పోవ‌డం గురించి మాట్లాడుకుంటున్నారు.

ఎడిటింగ్ లో తీసేసిన వైబ్ ఉంది సాంగ్

మిరాయ్ మూవీ నుంచి మేక‌ర్స్ ఫ‌స్ట్ సింగిల్ పేరిట రిలీజ్ చేసిన వైబ్ ఉంది సాంగ్ మంచి హిట్టైంది. తేజ స‌జ్జాతో పాటూ రితికా నాయ‌క్ క‌లిసి ఆ సాంగ్ లో వేసిన స్టెప్పులు అందరినీ అల‌రించాయి. కానీ సినిమా రిలీజ‌య్యాక ఆ సాంగ్ అందులో లేదు. క‌ట్ చేశారు. క‌థ‌కు అడ్డ‌మొస్తుంద‌ని వైబ్ ఉంది సాంగ్ ను మేక‌ర్స్ తీసేశారు. ఆ పాట‌తో పాటూ మ‌రో పాట‌ను కూడా మేక‌ర్స్ మిరాయ్ నుంచి తీసేశారు.

నిధి అగ‌ర్వాల్ తో స్పెష‌ల్ సాంగ్

మిరాయ్ సినిమాలో ఇస్మార్ట్ భామ నిధి అగ‌ర్వాల్ ఓ స్పెష‌ల్ సాంగ్ చేశారు. ఆ సాంగ్ ను డైరెక్ట్ గా థియేట‌ర్ల‌లోనే ఆడియ‌న్స్ కు స‌ర్‌ప్రైజ్ ఇవ్వాల‌నే ఆలోచ‌న‌తో ముందుగా రిలీజ్ చేయ‌లేదు. ఈ సాంగ్ కూడా క‌థ‌కు అడ్డొస్తుంద‌ని తీసేశార‌ని నెట్టింట టాక్ వినిపించ‌గా, రీసెంట్ గా దానిపై డైరెక్ట‌ర్ కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నిధి అగ‌ర్వాల్ తో ఓ స్పెష‌ల్ సాంగ్ ను షూట్ చేసిన విష‌యం నిజ‌మేన‌ని కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇందులో పెట్ట‌డం కుద‌ర‌లేద‌ని ఒక‌వేళ సీక్వెల్ వ‌స్తే అందులో ఈ సాంగ్ ను ఉప‌యోగించే అవ‌కాశ‌ముంద‌ని కార్తీక్ చెప్పారు.