Begin typing your search above and press return to search.

మిరాయ్@రూ.150 కోట్లు.. ఇంకా అదే దూకుడు..

అదే సమయంలో హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జా.. వరుసగా రెండో రూ.150 కోట్ల హిట్ ను అందుకున్నారు.

By:  M Prashanth   |   1 Oct 2025 8:12 PM IST
మిరాయ్@రూ.150 కోట్లు.. ఇంకా అదే దూకుడు..
X

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా రీసెంట్ గా మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సూపర్ హీరో జోనర్ లో రూపొందిన ఆ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ రూపొందించారు.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మిరాయ్.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మేకర్స్ కు మంచి లాభాలు అందించింది. సెప్టెంబర్‌ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా.. తొలి రోజు రూ.20 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌ లో చేరింది.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టింది. రిలీజ్ అయిన మూడో వారాల్లో ఆ మార్క్ అందుకోవడం విశేషం. అదే సమయంలో రీసెంట్ గా ఓవర్సీస్ లోని ఉత్తర అమెరికాలో మూడు మిలియన్ల మార్క్ ను కూడా అందుకుంది. తద్వారా ఈ సీజన్ లో అతిపెద్ద కమర్షియల్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

అయితే థియేటర్స్ లో భారీ పోటీ ఉన్నప్పటికీ.. వివిధ సినిమాలు ఆడుతున్నప్పటికీ.. మిరాయ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుందని చెప్పాలి. సాలిడ్ కలెక్షన్స్ ను సాధిస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జా.. వరుసగా రెండో రూ.150 కోట్ల హిట్ ను అందుకున్నారు.

సినిమాలో తన నటనతో మెప్పించారు. విలన్ గా మనోజ్ మంచు.. కీలక పాత్రల్లో జగపతిబాబు, శ్రియ శరణ్ నటించగా.. హై ఆక్టేన్ యాక్షన్‌ తో దృశ్యపరంగా గొప్ప కథనంతో సినిమా రూపొందింది. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆకర్షణీయమైన కంటెంట్ తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మంచి రాబడిని అందించింది.

అయితే అదిరిపోయే రివ్యూలు వచ్చినా.. మిరాయ్ టీమ్ టికెట్ల ధరలను పెంచకుండా వసూళ్లు పెరిగేలా చేసింది. సినిమా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే వారి ఉద్దేశ్యం కలెక్షన్స్ పరంగా హెల్ప్ చేసింది. ఇప్పుడు దసరా సెలవులు కనుక మిరాయ్ వసూళ్లు ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. మరి ఫుల్ రన్ లో మూవీ ఎంతటి వసూళ్లు రాబడుతుందో వేచి చూడాలి.