మిరాయ్: పవర్ ఫుల్ రోల్ మిస్ చేసుకున్న యంగ్ హీరో..ఎవరంటే?
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారి.. హనుమాన్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు తేజ సజ్జా.
By: Madhu Reddy | 24 Sept 2025 9:48 AM ISTమిరాయ్.. ఎక్కడ చూసినా ఈ సినిమా వైబ్ మారుమ్రోగుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారి.. హనుమాన్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు తేజ సజ్జా. పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు. అప్పుడే పాన్ ఇండియా లెవెల్ లో రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్నారు. సినిమా అనే వ్యసనంతోనే ఈ స్థాయిలో సక్సెస్ అందుకున్నారు అని ఇప్పటికే పలువురు డైరెక్టర్లు కూడా ప్రశంసలు కురిపించారు. అలాంటి తేజ తాజాగా నటించిన చిత్రం మిరాయ్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన 'హనుమాన్' సినిమాతో సూపర్ హీరోగా అవతరించిన ఈయన.. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని తొలి దర్శకత్వంలో వచ్చిన 'మిరాయ్' చిత్రం ద్వారా సూపర్ యోధ గా అవతరించారు.
సెప్టెంబర్ 12వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకొని.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు. ఈ పాత్రకు ఆయన తప్ప మరెవరు న్యాయం చేయలేరేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అంతలా తన నటనతో విశ్వరూపం చూపించేశారు మంచు మనోజ్.
అయితే ఇలాంటి పవర్ఫుల్ పాత్ర మొదట మనోజ్ కంటే మరో యంగ్ హీరోకి వెళ్లిందట. ఆయన ఎవరో కాదు సందీప్ కిషన్. టాలీవుడ్ హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్న సందీప్ కిషన్ ఈ పాత్ర చేయాలని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తో పాటు తేజ కోరారట. అయితే ఆ పాత్ర ఆయనకు నచ్చినా .. తనకున్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమాను చేయలేకపోయారట. అలా ఒక బ్లాక్ బస్టర్ మూవీలో పవర్ఫుల్ పాత్రను మిస్ చేసుకున్నారు సందీప్ కిషన్. మొత్తానికి అయితే సందీప్ కిషన్ వదులుకున్న ఈ పాత్రను మంచు మనోజ్ చేసి ఓవర్ నైట్ లోనే మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. అంతే కాదు ఈ పాత్ర కోసం హీరో కంటే ఎక్కువ అనగా ఏకంగా రూ.2.8 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
మిరాయ్ సినిమా విషయానికి వస్తే.. విజువల్ గ్రాండీరియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రితిక నాయక్ హీరోయిన్ గా నటించగా.. జగపతిబాబు, శ్రియ శరన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కథ మాత్రమే కాదు పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉన్న కారణంగా థియేటర్ ల నుంచి సూపర్ హిట్ "వైబ్ ఉందిలే" అనే పాటను తొలగించడం జరిగింది. కానీ ప్రేక్షకుల డిమాండ్ మేరకు నిన్నటి నుంచి ఈ పాటను థియేటర్లలో యాడ్ చేస్తూ అధికారిక ప్రకటన చేసింది మిరాయ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
