‘జైత్రయ’: తల్లి కలల కోసం పోరాడే హీరో ఎమోషనల్ జర్నీ
టాలీవుడ్ యువ హీరో తేజా సజ్జా వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్నాడు. హనుమాన్ తర్వాత ఆయన చేస్తున్న ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ మిరాయ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
By: M Prashanth | 9 Sept 2025 11:47 AM ISTటాలీవుడ్ యువ హీరో తేజా సజ్జా వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్నాడు. హనుమాన్ తర్వాత ఆయన చేస్తున్న ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ మిరాయ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌కి ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ 'వైబ్ ఉంది' మాస్ బీట్‌తో సోషల్ మీడియాలో చార్ట్స్‌ను షేక్ చేసింది. ఈ సాంగ్ ద్వారా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ రెండింటికీ కనెక్ట్ అయ్యేలా చేశారు. ఇప్పుడు ఆ హైప్‌ని కొనసాగిస్తూ రెండో సింగిల్ జైత్రయను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సినిమా యొక్క ఎమోషనల్ కోర్‌ని హైలైట్ చేస్తూ మదర్స్ లవ్, హీరో జర్నీని చూపించడం స్పెషల్‌గా నిలిచింది.
జైత్రయలో హీరో తన తల్లి కలల్ని నెరవేర్చుకోవడానికి చేసే పోరాటం చూపించారు. ఈ పాటలో శ్రీయా సరణ్ తేజా తల్లిగా కనిపించనుండగా, గౌర హరి కంపోజ్ చేసిన ట్యూన్ హృదయాలను తాకేలా ఉంది. శంకర్ మహదేవన్ శక్తివంతమైన వాయిస్‌తో పాటకి మరింత ఉత్కంఠను జోడించారు. చంద్రబోస్ రాసిన లిరిక్స్ ప్రతి లైన్‌లో ఫీలింగ్‌ని పంచుతూ, ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తాయి.
మొదటి సింగిల్ మాస్‌కు కనెక్ట్ అయితే, జైత్రయ మాత్రం థియేటర్స్‌లో క్లైమాక్స్ ఎఫెక్ట్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు. హీరో జర్నీని ఎలివేట్ చేయడమే కాకుండా, తల్లి కొడుకు బాండ్‌ని చూపించడంలో ఈ పాట కీలక పాత్ర పోషించనుంది. ఒకవైపు విజువల్స్‌కి సింక్ అయ్యేలా మ్యూజిక్ ఉంటే, మరోవైపు లిరిక్స్ తల్లిదండ్రుల కలల ప్రాముఖ్యతని హైలైట్ చేశాయి.
సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానున్న మిరాయ్ పాన్ ఇండియా రేంజ్‌లో అంచనాలను పెంచుకుంటోంది. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్ ప్యాకేజీగా ఈ మూవీని ప్రెజెంట్ చేయబోతున్నారని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ‘జైత్రయ’ లాంటి సాంగ్స్ ఆ అంచనాలను ఇంకా పెంచేస్తున్నాయి. మరి సినిమా రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.
