మిరాయ్ బుకింగ్స్.. మంగళవారం కూడా అదే మోత
సాధారణంగా మంగళవారం లాంటి వర్కింగ్ డేస్ లో కలెక్షన్లు తగ్గిపోవడం కామన్. కానీ మిరాయ్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ సోమవారం టెస్ట్ పాస్ అయ్యాక, మంగళవారం కూడా అదే బలాన్ని కొనసాగిస్తోంది.
By: M Prashanth | 16 Sept 2025 8:04 PM ISTయంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మొదటి వారం ముగిసే లోపు సెన్సేషనల్ స్థాయిలో వసూళ్లు సాధించి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. ప్రతి రోజు కలెక్షన్లు పెరుగుతుండటమే కాకుండా, ఫ్యామిలీస్, యూత్, కిడ్స్ అందరూ సమానంగా థియేటర్స్ కి వచ్చి ఆస్వాదిస్తున్నారు.
సాధారణంగా మంగళవారం లాంటి వర్కింగ్ డేస్ లో కలెక్షన్లు తగ్గిపోవడం కామన్. కానీ మిరాయ్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ సోమవారం టెస్ట్ పాస్ అయ్యాక, మంగళవారం కూడా అదే బలాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా బుక్ మై షో యాప్ లో ప్రతి గంటకి ఏకంగా 7 వేలకుపైగా టిక్కెట్లు బుక్ అవ్వడం ఈ సినిమా మీద ఉన్న ఊహించని క్రేజ్ ని రుజువు చేస్తోంది. ఇలా రోజు మొత్తానికి లక్షల సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడవుతుండటం మిరాయ్ ని కొత్త లెవెల్ కి తీసుకెళ్తోంది.
మూడురోజుల్లోనే రూ.81.2 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకున్న ఈ సినిమా, సోమవారం మరో 10 కోట్లను జోడించుకొని, ఇప్పటివరకు రూ.92 కోట్లకు పైగా చేరుకుంది. మంగళవారం కూడా ఇదే వేగం కొనసాగడంతో 100 కోట్ల క్లబ్ లోకి మిరాయ్ ఎంట్రీ కేవలం టైమ్ మేటర్ గా మారింది. ఇక ఓవర్సీస్ లోనూ మిరాయ్ అదే రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడం విశేషం.
తేజ సజ్జా హనుమాన్ తర్వాత మరోసారి సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మిరాయ్ ను పాన్ ఇండియా రేంజ్ లో నిలబెట్టాడు. ప్రత్యేకంగా హిందీ బెల్ట్ లో సినిమా రూ.10 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం చాలా పెద్ద రికార్డ్. ఇప్పటి వరకు అలాంటి స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న వారు టాలీవుడ్ టాప్ స్టార్ లే. తేజ సజ్జా తన కేటగిరీలో ఈ రికార్డు క్రియేట్ చేయడం బిగ్ అచివ్మెంట్.
సినిమా విజయం వెనుక ఉన్న బలమైన స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్సెస్ తోపాటు మనోజ్ మంచు పోషించిన విలన్ రోల్ కూడా ప్రధాన బలంగా నిలిచింది. శ్రీయ, జగపతి బాబు, జయరామ్ వంటి నటుల ప్రెజెన్స్ సినిమాకి మరింత బలం చేకూర్చింది. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని టెక్నికల్ గాను, విజువల్ గా అద్భుతమైన ట్రీట్ ఇచ్చారు. ఇక మంగళవారం కూడా బలంగా నిలబడిన మిరాయ్ ఇప్పుడు వరుస రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ వారం ముగిసే లోపు సెంచరీ కొట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులను బద్దలుకొడుతుందో చూడాలి.
